భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!

ఒక జపనీస్ టూరిస్ట్ ఇండియా ట్రిప్ ( Japanese tourist trip to India )గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియాలో తనకు కొన్ని మంచి అనుభవాలు ఉన్నా, ఇక్కడి విపరీతమైన శబ్ద కాలుష్యం తనను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె చెబుతోంది.

రెడిట్‌లో పెట్టిన పోస్ట్‌లో తన బాధను వెళ్లగక్కింది.ఆగ్రా, రాజస్థాన్, పంజాబ్ ( Agra, Rajasthan, Punjab )లాంటి ప్లేసెస్‌కి వెళ్లిన ఆ టూరిస్ట్, ఇండియన్ ఫుడ్, డ్రెస్సింగ్ స్టైల్‌కి ఫిదా అయిపోయింది.

అంతేకాదు, ఇక్కడి వాళ్లు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పింది.కానీ, ఎప్పుడూ ఏదో ఒక సౌండ్, చుట్టూ గందరగోళంగా ఉండటం తనకి నచ్చలేదంట.

"ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక నాయిస్ వినిపిస్తూనే ఉంటుంది, అది చాలా ఇరిటేటింగ్‌గా ఉంది" అని ఆ అమ్మాయి పోస్ట్‌లో రాసుకొచ్చింది."కొన్నిసార్లు అయితే ఆ నాయిస్ ఎక్కువైపోయి రూమ్‌లో కూర్చొని ఏడ్చేశాను" అని చెప్పింది.

Advertisement

రాత్రిపూట పెద్ద మ్యూజిక్, టపాకాయల సౌండ్స్‌తో నిద్ర కూడా కరువైందని వాపోయింది.

వెహికల్ హారన్స్, ముఖ్యంగా లారీ హారన్స్ తనను చంపేస్తున్నాయని చెప్పింది.చిన్న చిన్న ఫెస్టివల్స్‌కి కూడా పెద్ద డప్పులు, మ్యూజిక్‌తో రోడ్లన్నీ జామ్ అయిపోతాయని చెప్పింది.కాస్త సైలెంట్‌గా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ, ఈ నాయిస్‌ను ఎలా భరించాలో సలహా అడుగుతోంది.

రెడిట్‌లో చాలా మంది ఇండియన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.రద్దీ ప్లేసెస్‌లో నాయిస్ ఎంత ఉంటుందో తమకు తెలుసని, ఒక్కోసారి తమకే తట్టుకోవడం కష్టమవుతుందని ఒప్పుకుంటున్నారు.కొందరు తక్కువ క్రౌడ్ ఉండే ప్రశాంతమైన ప్లేసెస్‌కి వెళ్లమని సలహా ఇస్తున్నారు.

ఒక యూజర్ ఇయర్‌ప్లగ్స్ పెట్టుకుంటే నాయిస్‌ను కంట్రోల్ చేయొచ్చని, ఇది బెస్ట్ సొల్యూషన్ అని సలహా ఇచ్చాడు.ఇంకొక యూజర్ ఇండియన్స్ కూడా ఈ నాయిస్‌తో సఫర్ అవుతామని, కానీ అలవాటు పడిపోయామని చెప్పాడు.

త్రివిక్రమ్ వివాదం... నటుడు శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్?
రాత్రి 11 అయినా భోజనం లేదు.. భారతీయ విందులపై అమెరికన్ షాకింగ్ కామెంట్స్!

ఇండియా కల్చర్ ఇలానే ఉంటుందని, ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేయమని కొందరు సలహా ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు