వైరల్: వట్టి చేతులతోనే బాంబు తొలగించిన ఉక్రెయిన్ పౌరుడు ...!

మనలో చాలా మందికి దీపావళి టపాసులు పేల్చాలన్నా చాలా భయం.అందులోని నిజమైన బాంబులంటే ఆమడ దూరం పారిపోతారు.

ఎందుకంటే అవి ఏ మాత్రం పేలినా, ప్రాణాలు పోతాయి.మన శరీర భాగాలు కూడా ఎక్కడుంటాయో తెలియని పరిస్థితి.

అలాంటిది 500 కిలోల బాంబును ఎవరైనా చేతితో పట్టుకునే సాహసం చేస్తారా? నరమాత్రుడెవడూ అలాంటి పని చేయడు.కానీ ఓ ఉక్రెయిన్ పౌరుడు నిజంగానే అత్యంత శక్తివంతమైన బాంబును పట్టుకున్నాడు.

అంతేకాకుండా దాని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా నిర్వీర్యం చేసేశాడు.ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Advertisement

ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది.అత్యంత బలమైన సైనిక సామర్థ్యాలు కలిగిన రష్యా తన ప్రత్యర్థి ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది.

ముఖ్యంగా శక్తివంతమైన యుద్ధ విమానాల నుంచి భారీ బాంబులను జార విడుస్తోంది.తాజాగా సోమవారం ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై 500ల కేజీల బాంబును వేసింది.

ఈ ఘటనలో 18 మంది మరణించారు.అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

మరో ఘటనలో అంతే శక్తివంతమైన మరో 500ల కేజీల బాంబును కూడా రష్యా జార విడిచింది.అయితే అది పేలకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

ఉక్రెయిన్‌పై రష్యా వేసిన బాంబు పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే అది ఎప్పుడైనా అకస్మాత్తుగా పేలే అవకాశం ఉందని అక్కడి సైన్యం గమనించింది.వెంటనే బాంబు డిఫ్యూజల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.అందులో ఒక అధికారి నేరుగా బాంబు వద్దకు వచ్చాడు.

Advertisement

ఏ మాత్రం బిడియం లేకుండా, రక్షణ చర్యలేవీ తీసుకోకుండా వేగంగా పని కానిచ్చేశాడు.వట్టి చేతులతోనే బాంబును నిర్వీర్యం చేశాడు.

దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో అతడి ధైర్య సాహసాలు ప్రపంచానికి తెలిశాయి.

నెటిజన్లు అతడి ధైర్యాన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు