సాధారణంగా రెస్టారెంట్ హోటల్స్ భారీ ధరకు ఫుడ్స్ సేల్ చేస్తూ కస్టమర్లను దోచుకుంటాయి.అయితే కొన్నిసార్లు రెస్టారెంట్‌కి( Restaurant ) బొక్క పెట్టేందుకు కస్టమర్లు కూడా మోసాలు చేయడానికి సిద్ధమవుతారు.
తాజాగా యూకేలోని( UK ) బ్లాక్‌బర్న్‌లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ మహిళ కూడా ఇదే నాటకం ఆడాలనుకుంది.తన సగం తిన్న ప్లేట్‌లో జుట్టును( Hair ) ఉంచడం ద్వారా స్కామ్ చేయడానికి ప్రయత్నించింది.
తన వెంట్రుకలతో కూడిన ఆహారాన్ని రెస్టారెంట్‌లో అందజేస్తోందని ఆరోపిస్తూ, సీన్ చేసింది.అలా బిల్ ఎగ్గొట్టాలని అనుకుంది.
ఆమె ప్లాన్ వర్క్ ఔట్ కావడంతో యజమాని, టామ్ క్రాఫ్ట్, ఆమెను శాంతింపజేయడానికి ఆమెకు వాపసు ఇచ్చాడు.
అయితే ఆమె అబద్ధం చెబుతోందని అతనికి వెంటనే తెలిసింది.యజమాని తన సిబ్బంది పరిశుభ్రత నియమాలు పాటించారా లేదా అని సెక్యూరిటీ కెమెరా( Security Camera ) ఫుటేజీని తనిఖీ చేశాడు.తరువాత టేబుల్ వద్ద ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సదరు మహిళ కనిపించింది, ఆపై ఆమె తల నుంచి కొంత జుట్టును తీసి తన ప్లేట్‌లో పెట్టడం కూడా చాలా క్లియర్‌గా కనిపించింది.
అప్పుడే ఈ మోసం గురించి అతనికి తెలిసింది.ఆ షాక్ నుంచి తెరుకున్నాక ఇతర రెస్టారెంట్ యజమానులను హెచ్చరించాలని నిర్ణయించుకున్నాడు.
ఓ సందేశంతో కూడిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.ఆ మహిళను సిగ్గు పరచడం తనకు ఇష్టం లేదని, అయితే ఇలాంటి నిజాయితీ లేని వ్యక్తుల వల్ల రెస్టారెంట్ ఇండస్ట్రీ( Restaurant Industry ) చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తుందని అన్నాడు.ఇలాంటి స్కామర్ల ద్వారా ఇతర వ్యాపారాలు మోసపోకుండా ఉండేందుకు తన పోస్ట్ సహాయపడుతుందని అతను ఆశిస్తున్నాడు.అతని పోస్ట్ నవంబర్ 5న వైరల్ అయింది.దీనికి 15,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు మోసం చేసిన మహిళను తిట్టిపోశారు.