భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్‌కు గతంలో మాదిరిగా పేచీ పెట్టకుండా అనుమతి మంజూరు చేసింది బ్రిటన్ ప్రభుత్వం.ఈ మేరకు నవంబర్ 22 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల అప్రూవుడ్ వ్యాక్సిన్ జాబితాలో కోవాగ్జిన్‌కు స్థానం కల్పిస్తామని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వల్ల కోవాగ్జిన్ వేయించుకున్న వారు .బ్రిటన్‌లో అడుగుపెట్టిన తర్వాత క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.ఈ మేరకు భారత్‌లో బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.నవంబర్ 22 ఉదయం 4 గంటలకు ఈ ఆదేశాల్లో అమల్లోకి రానున్నాయి.
కోవాగ్జిన్‌తో పాటు డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌లోని చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లకు సైతం యూకే సర్కార్ అంగీకారం తెలిపింది.దీని వల్ల యూఏఈ, మలేషియా దేశాల వాసులకు ప్రయోజనం చేకూరనుంది.
అంతకుముందు కోవిషీల్డ్ టీకాను వేసుకున్న భారతీయులను … వ్యాక్సిన్ వేసుకోని వారిగానే పరిగణించి క్వారంటైన్‌లో వుండాల్సిందేనంటూ బ్రిటన్ ప్రభుత్వం చేసిన రాద్ధాంతం అంతా కాదు.భారత్‌లో కోవిషీల్డ్ వేసుకున్న వారిని తమ దేశంలో టీకాలు వేసుకోని వారిగానే పరిగణిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించడంపై ఇండియా అగ్గిమీద గుగ్గిలమైన సంగతి తెలిసిందే.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. ఈ చర్యపై తీవ్రంగా పరిగణించిన భారత్.
దెబ్బకు దెబ్బ తీసింది.
దీనిలో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చే పౌరులపై ఆంక్షల కొరడా ఝుళిపించింది.
భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు 3 సార్లు కొవిడ్ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేస్తామని చెప్పింది.దీని ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 ఆర్‌టీ పీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాలని తెలిపింది.
ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటివద్ద/ హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి.
అయితే భారత్ ఈ స్థాయిలో స్పందిస్తుందని ఊహించని యూకే.ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు.
టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది.వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలోకి ఇండియాను చేర్చింది.కొత్త మార్గదర్శకాల ప్రకారం.అక్టోబర్ 11 నుంచి బ్రిటన్‌కు వచ్చే భారత ప్రయాణికులు కోవిషీల్డ్ లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లైతే అలాంటి వారికి క్వారంటైన్ తప్పనిసరి కాదని తెలిపింది.