నువ్వూ వలసదారుల బిడ్డవే .. శరణార్ధులపై అంత కఠినంగానా : యూకే హోంమంత్రికి బంధువు వార్నింగ్

భారత సంతతికి చెందిన యూకే హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్( UK Home Secretary Suella Braverman ) శరణార్ధులు, వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తుండగా.

మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో ఢిల్లీలో వుంటున్న ఆమె బంధువు ఫాదర్ ఐరెస్ ఫెర్నాండెజ్( Ayres Fernandez ) స్పందించారు.

నువ్వు కూడా వలస వచ్చినవారి బిడ్డవేనని.శరణార్ధులు, వలసదారుల పట్ల కఠినంగా వుండటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

వలసదారులకు పుట్టిన బిడ్డనన్న సంగతిని సుయెల్లా గుర్తుంచుకోవాలని ఐరెస్ పేర్కొన్నారు.ఈ విషయంలో ఆచితూచి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.

Advertisement

సుయెల్లా తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్( Christy Fernandez ) తన నలుగురు తోబుట్టువులతో కలిసి కెన్యాలో( Kenya ) పెరిగినట్లు ఫాదర్ చెప్పారు.స్వతహాగా చాలా దృఢమైన వ్యక్తిత్వం వున్న సుయెల్లాకు సొంత ఆలోచనలు వున్నాయని.

కానీ వలసదారులపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆమెకు ఎవరైనా మద్ధతు ఇస్తున్నారని తాను భావిస్తున్నానని ఐరెస్ పేర్కొన్నారు.అయితే దేశానికి హోంమంత్రి వంటి స్థాయిలో వున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు.

సర్దుబాటు చేయాల్సిన కొన్ని అవసరాలు, వ్యక్తుల జీవన విధానాలు, అభిప్రాయాలను కూడా సుయెల్లా గౌరవించాలని ఫెర్నాండెజ్ సూచించారు.రాజకీయాల్లో వున్న వారికి ఇది అత్యంత కీలకమైనదని.

సుయెల్లా ప్రశాంతంగా వుండాలని, ప్రజలతో సన్నిహితంగా వుండాలని తాను ప్రతిరోజూ ప్రార్ధిస్తున్నానని ఫాదర్ చెప్పారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇకపోతే.ఇటీవల జరిగిన టోరీ కాన్ఫరెన్స్‌లో ( Tory conference )పాల్గొన్న సుయెల్లా బ్రేవర్‌మాన్ ప్రసంగించారు.పేద దేశం నుంచి ధనిక దేశానికి మారడం అనేది బిలియన్ల మంది ప్రజలకు ఒక కల అన్నారు.20వ శతాబ్ధంలో తన తల్లిదండ్రులు కూడా ఈ మార్పును గమనించారని ఆమె పేర్కొన్నారు.కానీ అనియంత్రిత వలసలు, సరిపడని ఏకీకరణ, బహుళ సాంస్కృతికత, తప్పుదోవ పట్టించే సిద్ధాంతాలు గత కొన్ని దశాబ్ధాలుగా ఐరోపాకు విషపు కలయికగా రుజువు చేశాయని సుయెల్లా అభిప్రాయపడ్డారు.

Advertisement

అంతిమంగా బహుళ సాంస్కృతికత విఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు.

నార్త్ లండన్‌లోని హారోలో ( Harrow, North London )ఏప్రిల్ 3, 1980లో జన్మించారు సుయెల్లా బ్రేవర్‌మాన్ .ఆమె అసలు పేరు స్యూ- ఎల్లెన్ కాసియానా ఫెర్నాండెజ్‌.తండ్రి క్రిస్టీ, తల్లి ఉమా ఫెర్నాండెజ్.

వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే.వివాహం తర్వాత కెన్యా, మారిషస్‌లలో వున్న ఈ జంట 1960లలో బ్రిటన్‌కు వలస వచ్చారు.ఆమె తల్లి వృత్తి రీత్యా నర్సు.2001 సాధారణ ఎన్నికలలో, 2003 బ్రెంట్ ఈస్ట్ ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు.బ్రేవర్‌మాన్ తల్లిదండ్రులు హిందువులు.

కానీ ఈమె మాత్రం త్రిరత్న బౌద్ధ సంఘంలో సభ్యురాలు.లండన్ బౌద్ద కేంద్రానికి ఆమె ప్రతి నెలా హాజరవుతారు.

బుద్ధుని సూక్తుల సమాహారమైన ధమ్మపదంపై ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.సుయెల్లా భర్త పేరు రేల్ బ్రేవర్‌మాన్.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

తాజా వార్తలు