కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనండి.. భారత సంతతిని కోరిన యూకే ప్రభుత్వం

కరోనా వైరస్‌‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి.ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్‌‌లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగస్వాములు కావాలని భారత సంతతితో పాటు ఇతర జాతులను యూకె ప్రభుత్వం కోరింది.ఇందుకు సంబంధించి గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ భాషలలో ఓ ప్రకటనను జారీ చేసింది.

కాగా ఈ వైరస్ నుంచి రక్షించే సురక్షితమైన వ్యాక్సిన్ ఆవిష్కరణను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ అంతటా దాదాపు 1,00,000 మందికి పైగా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.అయితే దేశంలోని కొన్ని జాతులకు సంబంధించిన వర్గాల నుంచి వచ్చే వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉంది.

ఈ క్రమంలో మైనారిటీలు, 65 ఏళ్లు పైబడిన వారితో పాటు ఫ్రంట్‌లైన్ ఆరోగ్య , సామాజిక సంరక్షణ కార్మికులు.నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) కోవిడ్ 19 వ్యాక్సిన్ రీసెర్చ్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Advertisement

భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వ్యాక్సిన్‌ను కనుగొనటానికి పగలు, రాత్రి అన్న తేడా లేకుండా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.ఇంతటి కీలకమైన పరిశోధనలో అధ్యయనాల కోసం అన్ని నేపథ్యాలు, వయస్సు గల వేలాది మంది ప్రజలు అవసరమని భారత సంతతికి చెందిన యూకె మంత్రి అలోక్ శర్మ వ్యాఖ్యానించారు.గత నెలలో ప్రారంభించిన ఎన్‌హెచ్ఎస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ రీసెర్చ్ రిజిస్ట్రీ అనేది పూర్తిగా ఆన్‌లైన్ సేవ.ఇది కరోనా అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్‌లో భవిష్యత్తులో ప్రజలు పాలుపంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.రాబోయే రోజుల్లో పరిశోధనా సంస్థలు, వ్యాపార సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఎన్‌హెచ్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది.

వ్యాక్సిన్లు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉన్నాయని నిర్థారించడానికి వివిధ దశల్లో పరీక్షించబడతాయి.ట్రయల్స్‌లో పాల్గొనడానికి ముందుకు వచ్చిన వాలంటీర్లకు అది ఏ దశలో ఉందో, ఇప్పటి వరకు ఎలా పరీక్షించబడిందనే వివరాలను తెలియజేస్తామని యూకె డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రీయల్ స్ట్రాటజీ (బీఐఎస్) తెలిపింది.

Advertisement

తాజా వార్తలు