ఒకప్పుడు బుల్లి తెర స్టార్ యాంకర్ ఓవరు అంటే ఠక్కున ఉదయభాను అంటూ చెప్పేవారు.ఇప్పుడు సుమ ఎంత పాపులర్ అయ్యిందో అంతకు మించిన పాపులర్‌గా ఉదయభాను పేరు దక్కించుకుంది.
ఉదయభాను కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వివాదాలు చుట్టు ముట్టడం, పెళ్లికి సంబంధించిన వార్తలు రావడంతో ఆమె కెరీర్ మద్యలోనే ఆగిపోయినట్లయ్యింది.ఇప్పుడు కూడా అడపా దడపా కనిపిస్తూ వస్తున్నా కూడా గతంలో మాదిరిగా ఈ అమ్మడికి క్రేజ్ లేదు.

క్రేజ్ లేకున్నా కూడా ఈమె బాగానే సంపాదిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ అమ్మడి జోరు చూస్తుంటే అంతా కూడా అవాక్కవుతున్నారు.తాజాగా ఈమె ఏకంగా బెంజ్ కారును కొనుగోలు చేసింది.తన పిల్లలు మరియు భర్తతో కలిసి ఈమె బెంజ్ కారు ముందు ఫొటో దిగి తాను బెంజ్ కారు కొన్నానోచ్ అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టింది.

అవకాశాలు లేని ఈ సమయంలో బెంజ్ కారు ఎలా కొన్నావంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం సినిమాలు లేవు, టీవీ షోలు లేకున్నా కూడా ఈమెకు వచ్చే ఆదాయం లేకున్నా కూడా ఈమె మాత్రం ఇలా బెంజ్ కారు కొనడం ఆశ్చర్యంగా ఉందని కొందను నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఆఫర్లు లేని ఈ సమయంలో బెంజ్ కారు ఎలా కొన్నావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.