ఆగస్టు నెలలో సక్సెస్ కొట్టాలని చూస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.

అయినప్పటికీ ప్రస్తుతం యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే వరుస సినిమాలను చేయడంలో యంగ్ హీరోలు( Young heroes ) ఎక్కడ తడబడకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.ఇక ఇప్పుడు కూడా నాని లాంటి యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా మారే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే వాళ్ళు ఆగస్టు నెలలో థియేటర్ లోకి రావడానికి సిద్ధమయ్యారు.ఇక రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో( Ram Double ISmart ) సందడి చేయనుండగా నాని సరిపోదా శనివారం సినిమాతో ( Saripodhaa Sanivaaram )మరోసారి భారీ సక్సెస్ ని కొట్టాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే నాని గత కొన్ని సినిమాల నుంచి చాలా సెలెక్టెడ్ గా సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు గత సంవత్సరం దసరా హాయ్ నాన్న లాంటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న నాని ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారం సినిమాతో సక్సెస్ ని సాధించడానికి మన ముందుకు వస్తున్నాడు.

ఇక వివేక్ ఆత్రేయ( Vivek Atreya ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటూ అటు డైరెక్టర్, ఇటు హీరో మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.ఇక అలాగే రామ్ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద భారీ అంచనలైనైతే పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ కొడతానని ఆయన కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ నైతే వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక మొత్తానికైతే వీళ్ళు ఈ సినిమాలతో మరోసారి వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోగా పరిచయం చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

జలుబు, దగ్గు, కఫంతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి!
Advertisement

తాజా వార్తలు