గురువారం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ తో సహా పలువురు బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.వేలాది మంది అతిరధ మహారథుల ముందు,విదేశీ అధినేతల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.
అయితే ఈ మహా కార్యక్రమానికి ఒక ఇద్దరు ఎంపీ లు సాదాసీదాగా సైకిల్ పై రావడం విశేషం.ఎమ్మెల్యేలు అంటేనే పెద్ద ప్రోటోకాల్ ని పాటిస్తూ ఉంటారు.
అలాంటిది ఎంపీ లు అయ్యి కూడా వారిద్దరూ సైకిల్ పై రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.వారే బీజేపీ కి చెందిన రాజ్యసభ ఎంపీ మన్షుక్ లాల్ మాండవ్యి, అర్జున్ రామ్ మేఘవాల్.
వారిద్దరూ కూడా సైకిల్‌పై రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చారు.

సౌరాష్ట్రకు చెందిన 46 ఏళ్ల మాండవ్యి గత అయిదేళ్ల నుంచి పార్లమెంట్‌కు సైకిల్‌పైనే వస్తున్నారు.రైతు కుటుంబంలో జన్మించిన ఆయన సైకిల్‌ను నడపడం ఫ్యాషన్ కాదు అని, దాన్నో పాషన్‌గా భావిస్తానని ఎంపీ మాండవ్యి తెలిపారు.రాజకీయవేత్తగా మారిన మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్ అర్జున్ రామ్ మేఘవాల్ కూడా కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లేందుకు ఇష్టపడుతారు.
బికనీర్‌కు చెందిన ఈయన.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్‌గోపాల్ మేఘవాల్‌పై గెలుపొందారు.2017లో ఈయన ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పనిచేయగా, మాండవ్యి రోడ్డు రవాణా, రహదారులు, కెమికల్, ఫెర్టిలైజర్స్, షిప్పింగ్ శాఖలకు మంత్రిగా చేశారు.
.