చైల్డ్ పోర్నోగ్రఫీపై స్టింగ్ ఆపరేషన్‌: 17 మంది అరెస్ట్, నిందితుల్లో ఇద్దరు డిస్నీ ఉద్యోగులు

ఫ్లోరిడాలో విజృంభిస్తున్న చైల్డ్ పోర్నగ్రఫీని అరికట్టేందుకు అక్కడి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో పోల్క్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో 17 మంది పట్టుబడ్డారు.

 Two Disney Employees Among 17 Arrested In Florida-TeluguStop.com

వీరిలో ప్రముఖ యానిమేషన్ సంస్థ డిస్నీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు.

ఫ్లోరిడాలోని లేక్ ఆల్ఫ్రెడ్‌కు చెందిన బ్రెట్ కిన్నే తాను డిస్నీ వరల్డ్‌లో గెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు.

ఇతనిపై చైల్డ్ పొర్నోగ్రఫీని ఇతరులతో పంచుకున్నట్లు తదితర అభియోగాలపై కేసు నమోదు చేశారు.అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 10 ఏళ్ల వయసున్న బాలుర చిత్రాల కోసం కిన్నే తరచూ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేవాడని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

ఇతను చైల్డ్ పొర్నోగ్రఫీకి బానిసని.కనీసం 22 ఏళ్ల నుంచి కిన్నేకి ఈ అలవాటు ఉందని దర్యాప్తులో తేలింది.

Telugu Florida-

ఫ్లోరిడాలోని డావెన్ పోర్ట్‌కు చెందిన మరో డిస్నీ ఉద్యోగి డోనాల్డ్ డర్ జూనియర్‌ను సైతం ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.ఇతను వాల్ట్ డిస్నీ రిసార్ట్స్‌లో కస్టోడియల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.డర్ నుంచి పిల్లల అశ్లీల చిత్రాలతో కూడిన ఎలక్ట్రానిక్ టాబ్లెట్‌, చిన్నారుల ఫోటోలతో కూడిన డివిడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు వక్రబుద్ధి వున్న మాట నిజమే కానీ.

తాను రాక్షసుడిని మాత్రం కాదని డర్ డిటెక్టివ్‌లతో చెప్పినట్లుగా షెరీఫ్ కార్యాలయం తెలిపింది.వీరి అరెస్ట్‌లపై వాల్ట్ డిస్నీ సంస్థ స్పందించింది.

కెన్నీ ఇక ఉద్యోగంలో కొనసాగడని.అలాగే డర్ ప్రస్తుతం పెయిడ్ లీవ్‌లో ఉన్నాడని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube