ఏపీలో కూడా ఆక్సిజన్ కష్టాలు..ఇద్దరు మృతి, ఎక్కడంటే..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కలిగిన రాష్ట్రాలలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.ఈ పరిణామంతో సంబంధిత రాష్ట్రాలలో .

 కరోనా రోగులు బెడ్లు, ఆక్సిజన్  కొరత  లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి తరుణంలో చాలావరకు ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ టన్నుల కొద్దీ సరఫరా అవుతూ ఉంది.

ఈ విధంగా దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా .ఎక్కడికక్కడ కరోనా కట్టడి చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.ఇదిలాఉంటే ఇటీవల విజయనగరం జిల్లాలో ఇద్దరు కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ లో మొట్టమొదటి సారి .ఆక్సిజన్ అందక ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఇదే కావటంతో .సీఎం తీవ్ర ఆందోళనకు గురయ్యారట.విజయనగరం జిల్లా.

Advertisement

మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.దీంతో సీఎం జగన్ జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అట.ఇదే తరుణంలో అక్కడి ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. .

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు