లడఖ్ మోటార్‌సైకిల్ యాత్ర కోసం ఇండియన్ నేవీతో టీవీఎస్ కంపెనీ పార్ట్‌నర్‌షిప్..

లడఖ్‌లోని( Ladakh ) అందమైన ప్రాంతంలో ఒక థ్రిల్లింగ్ మోటార్‌సైకిల్ యాత్రను ప్రారంభించేందుకు భారత నౌకాదళం టీవీఎస్ మోటార్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.టీవీఎస్ అపాచీ మోటార్‌సైకిళ్లను ఉపయోగించి ఈ 28 రోజుల ప్రయాణాన్ని నౌకాదళ అధికారులు చేపట్టనున్నారు.

 Tvs Company Partnership With Indian Navy For Ladakh Motorcycle Yatra, Tvs, India-TeluguStop.com

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరానికి నివాళిగా దీనిని చేపట్టనున్నారు.ఈ కార్యక్రమం ఢిల్లీలో ఫ్లాగ్ ఆఫ్ వేడుకతో ప్రారంభమైంది.

34 మంది నౌకాదళ అధికారుల( naval officers ) బృందం టీవీఎస్ అపాచీ RTR 200 4V, టీవీఎస్ అపాచీ RR 310 మోటార్‌సైకిళ్లపై చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్, కార్గిల్ నుబ్రా, చివరగా లేహ్ మీదుగా మొత్తం 5,600 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.ఈ యాత్ర జులై 12, 2023న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ముగుస్తుంది.

టీవీఎస్ అపాచీ మోటార్‌సైకిళ్లు ( TVS Apache Motorcycles )ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.వీటి పైన నౌకాదళ అధికారులు ప్రయాణించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

లడఖ్‌లోని పాఠశాలలు, కళాశాలల్లో సమాచార సెషన్‌లను నిర్వహించడం ద్వారా భారత నౌకాదళం గురించి అవగాహన పెంచడం రైడర్‌ల లక్ష్యం.అలానే అగ్నిపథ్ పథకంతో( Agnipath scheme ) సహా నౌకాదళంలో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు గురించి అవగాహన పెంచనుంది.నేవీలో చేరేందుకు యువతను, ముఖ్యంగా మహిళలను ప్రేరేపించడం కూడా వారి లక్ష్యం.

యాత్ర సమయంలో, రైడర్లు కార్గిల్ వార్ మెమోరియల్, రెజాంగ్ లా యుద్ధ ప్రదేశంలో నివాళులర్పిస్తారు.వారు నేవీ బ్యాండ్‌తో కూడిన బ్యాండ్ కచేరీ, నేవీ జట్టు, లడఖ్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ వంటి ఉత్తేజకరమైన స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube