క్రీడాకారులకు ఇంగ్లాండ్ లాన్ టెన్నిన్ క్లబ్ గుడ్‌న్యూస్ తెలిపింది.వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ( Wimbledon Grand Slam )టైటిల్ గెలిచిన వారికి ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ ను సాధించినవారికి ఏకంగా 56.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని ఇవ్వనున్నట్లు వెల్లడించింది.అంటే భారత్ కరెన్సీలో రూ.464 కోట్లు అన్నమాట.ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్‌మనీని ప్రకటించడంతో క్రీడాకారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వింబుల్డన్ ఛాంపియన్‌షిప్( Wimbledon Tennis Championships ) జులై 3 నుంచి 16వ తేదీ వరకు జరగనుంది.
పరుషులతో పాటు మహిళల విభాగాల్లో కూడా పోటీలు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రైజ్‌మనీ గురించి నిర్వాహకులు ప్రకటన చేశారు.భారీగా ప్రైజ్‌మనీని ప్రకటించడంతో ఈ సారి ఆటగాళ్లు భారీగా పోటీ పడే అవకాశముంది.ఆటగాళ్లు మరింత ఉత్సహంతో ఆడే అవకాశముందని తెలుస్తోంది.ఇప్పటివరకు నోవాక్ జకోవిచ్( Novak Djokovic ) 23 గ్రాండ్‌స్లమ్ టైటిళ్లను గెలుచుకోగా.24వ టైటిట్ గెలుచుకునేందుకు గట్టి పోటీ ఇవ్వనున్నాడు.
ఇక నోవాక్ జకోవిచ్‌కు స్విటెక్ గట్టి పోటీ ఇవ్వనున్నాడు.2022లో ప్రకటించిన ప్రైజ్‌మనీతో పోలిస్తే ఇప్పుడు ప్రకటించిన ప్రైజ్‌మనీ 11.2 శాతం అదనం.పురుషులు, మహిళల సింగిల్స్ లో ఒక్కో విజేతకు మూడు మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.మూడు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.24.06 కోట్లు వస్తుందన్నమాట.ఇక తొలి రౌండ్‌లో ఓడినవారికి ఒక్కొక్కరికి రూ.57 లక్షలు అందిస్తారు.ప్రైజ్‌మనీని పెంచడం తమకు కూడా ఆనందంగా ఉందని నిర్వాహకులు చెప్పారు.
ప్రైజ్‌మనీ పెంచడానికి కారణాలను కూడా ఈ సందర్బంగా వివరించారు.ఈవెంట్ ప్రారంభ రౌండ్‌లో ఆటగాళ్లకు మద్దతు అందించడం కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్‌మనీ పెంచినట్లు చెప్పారు.
జకోవిచ్, స్విటెక్ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నారు.ఇప్పుడు గ్రాండ్ స్లమ్ టైటిల్‌పై కన్నేశారు.







