తాజాగా బుల్లితెర నటి తునీషా శర్మ షూటింగ్ సెట్లో బలవన్మరణానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆమె మృతి పట్ల ఆమె తల్లితో పాటు పలువురు అనుమానపడ్డారు.
ఎందుకంటే కెరియర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తునీషా ఆ విధంగా 20 ఏళ్లకే తను చాలించింది అంతే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు.ఇక పోస్టుమార్టం నివేదికలో తునీషాది ఆత్మహత్య అని రుజువయింది.
తునీషా, షీజాన్ ఖాన్ ఇద్దరు ప్రేమించుకున్నారని, పదిహేను రోజుల క్రితం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట.అయితే అదే వార్తను ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉరి వేసుకున్నప్పుడు ఊపిరాడకే ఆమె మరణించింది అని తెలిపారు.తన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని అదే విషయం పోస్టుమార్టం లో కూడా వెళ్లడైందని తెలిపారు.ఇప్పటికే తూనీషా ఆత్మహత్య కేసులో భాగంగా ఆమె ప్రియుడు షీజాన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.తునీషా మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో అలాగే ఆమె కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.
చిన్న వయసులోనే కూతురు అలా తనువు చాలించడంతో తునీషా తల్లి గుండె వెలిసేలా రోదించింది.ఆమెతో పాటు నటించే తోటి నటీనటులు కూడా ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోయారు.

అయితే కెరియర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తునీషా ఈ విధంగా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడంతో అభిమానుల సైతం బాధపడుతున్నారు.తునీషా ప్రముఖ టీవీ షో ఆలీబాబా దస్తాన్ లో షెహజాదిగా నటించింది.ఇక బాలీవుడ్ లో భారత్ కా వీర్ పుత్ర – మహా రాణా ప్రతాప్ అనే చారిత్రాత్మక సీరియల్ ద్వారా టెలివిజన్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా నటించి మెప్పించింది.







