కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయం ఆసక్తిగా మారుతోంది.గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి రాధా పేరుతో టీడీపీ, వైసీపీ వర్గాల ఫ్లెక్సీలు వెలిసాయి.
రంగా వర్ధంతి సందర్భంగా రాధా – రావి యూత్ పేరుతో టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.ఇప్పటికే రాధాతో రావి వెంకటేశ్వర రావు రెండు, మూడు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు గుడివాడలో రాధా ఏ కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి కొడాలి నాని వచ్చి కలుస్తున్నారు.ఈ నేపథ్యంలో కొడాలి నాని, వంగవీటి రాధా పేర్లతో ఏర్పాటైన ప్లెక్సీలు చర్చనీయాంశమైయ్యాయి.
ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.







