దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” పాదయాత్ర ప్రకంపనాలు సృష్టిస్తుంది.యాత్రలో అన్ని వర్గాల ప్రజలు రాహుల్ గాంధీకి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.రాహుల్ పాదయాత్ర పై ప్రశంసల వర్షం కురిపించారు.
పాదయాత్రలో రాహుల్ గాంధీ రాజకీయాల గురించి కాకుండా సెక్యులరిజం… మానవ విలువలను బతికించుకోవడానికి ప్రజల మధ్య సమానత్వాన్ని సాధించడానికి గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నారని స్పష్టం చేశారు.అందువల్లే రాహుల్ గాంధీని ప్రజాస్వామ్య వాదులందరూ ప్రశంసిస్తున్నారు.
రాహుల్ పాదయాత్ర అద్భుతంగా సాగుతోంది.
పాదయాత్రలో రాహుల్ ఎక్కడా కూడా రాజకీయాలు… పార్టీల గురించి మాట్లాడటం లేదు.
కేవలం సిద్ధాంతపరమైన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.అందువల్లే రాహుల్ నీ పనిగట్టుకుని కొంతమంది టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి నెహ్రూ ఎంతో చేశారు.రాష్ట్రంలో బలవంతంగా హిందీని వద్దే ప్రయత్నం చేయలేదు.
కానీ ప్రస్తుతం.అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీరియస్ కామెంట్లు చేశారు.
తమిళనాడు రాష్ట్రానికి ఐఐటీ మద్రాస్, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ వంటివి నెహ్రూ వల్లే రావటం జరిగాయని చెప్పుకొచ్చారు.ఇదే సందర్భంలో మహాత్మా గాంధీ గారు నెహ్రూ పాలనను ప్రశంసించారని.
గుర్తు చేశారు.ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు నెహ్రూను గుర్తు చేస్తుందని సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.







