‘పుష్ప’ అనే పేరు పూర్తిగా ఉచ్చరించాల్సిన అవసరం లేదేమో.ఎందుకంటే యావత్ దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపిన సినిమా పేరని అందరికీ తెలిసిందే.
ఆ పేరు వినగానే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరి కళ్ళముందు మెదులుతాడు.ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలోని మాస్ పాటలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఇపుడు ఎక్కడ ఏ ఫంక్షన్లో చూసినా పుష్ప సినిమా పాటలే వినబడుతున్నాయి.
ఇక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడంతో ఆయా సినిమాలు పాటలకు ఎవరు డాన్సులు వేసినా క్షణాలలో వైరల్ కావడం విశేషం.
అవును, ఈ సినిమా పాటలకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్… అనే తేడా లేకుండా అందరూ ఎంతో అందంగా స్టెప్పులేస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది రకరకాలుగా డాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొత్తగా తాజాగా ఓ వీడియో ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది.
షేర్ చేసిన ఒక్కరోజులోనే పాపులర్ అయింది.

అవును, తాజాగా ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో, హై హీల్స్ వేసుకొని మరీ ‘సామి సామి’ పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది.కాగా ఆ అమ్మాయి డాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇక అల్లు వారి ఆనందానికి అయితే హద్దే లేదు.
అలాగే ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు తనను మరింత ఉత్సాహపరుస్తూ కనిపించారు.ఇక ఈ వీడియోను 5 లక్షల కంటే ఎక్కువ మంది లైక్స్ చేయడం విశేషం.
అలాగే చీరకట్టులో అమ్మాయి డాన్స్ అద్భుతంగా చేసిందని, ఆమె డాన్స్ చూడడం చాలా సరదాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







