మరో రెండు నెలలు అలిపిరి మెట్ల మార్గం మూసివేత..!

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో సగం మందికి పైగా కాలినడకన మెట్ల దారి ద్వారా కొండపైకి ఎక్కుతారు.

మెట్ల మార్గం నుండి వెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం కాగా.

మరొకటి శ్రీవారి మెట్ల దారి.ఎవరి వీలుని బట్టి వారు మెట్ల దారిని ఎంచుకుంటారు.

అయితే మే నెల నుండి మరమత్తుల నిమిత్తం అలిపిరి మెట్ల మార్గం మూసేశారు.కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్న సందర్భంగా ఈ టైం లోనే మరమత్తులు చేయడం మంచిందని భావించి పనులు మొదలు పెట్టారు కాని అనుకున్న టైం కు పనులు పూర్తి కాలేదని తెలుస్తుంది.

ఈ రెండు నెలలు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు.భక్తులు ఎవరు ఈ మెట్ల ద్వారా కొండ పైకి ఎక్కే అవకాశం లేదని వెల్లడించారు.

Advertisement

అయితే ఇప్పుడు రెండు నెలలు కావొస్తున్నా అక్కడ పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి.మే నెలలో మొదలైన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలు ఈ మార్గాన్ని మూసేసి మరమత్తులు చేయాలని నిర్ణయించారు తిరుమల తిరుపతి దేవస్థానం నివాహకులు.

భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.మెట్ల దారి గుండానే వెళ్లాలనుకునే వారికి ప్రస్తుతం శ్రీవారి మెట్ల గుండా వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు