ఏదో తెలుగు సినిమాలో చెప్పిన డైలాగ్ మాదిరిగా సంకల్పం గొప్పది అయితే పంచభూతాలు కూడా ఏకం అయ్యి మనకు సహకరిస్తాయి అంటారు.అలాగే హాంకాంగ్‌లో ఇప్పుడు 22 ఏళ్ల యువకుడు లక్షలాది మందిని రోడ్డు మీదుకు తీసుకు రాగలిగాడు.
అతడి మాటలపై నమ్మకంతో, అతడు మాట్లాడుతున్న మాటలు ఆలోచనాత్మకంగా ఉండటంతో హాంకాంగ్ జనాలు అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అతడి వెనుక నిలిచేందుకు సిద్దం అయ్యారు.అతడు ఏం చెబితే అది చేసేందుకు రెడీగా ఉన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎన్నో వందల ఏళ్లుగా చైనా ఆధిపత్యంలోనే హాంకాంగ్ ఉంటుంది.హాంకాంగ్‌లో రాజకీయం చేస్తున్నది ఇప్పటికి కూడా చైనానే.హాంకాంగ్‌లో అధ్యక్షుడు ఎవరు అవ్వాలన్నది చైనానే నిర్ణయిస్తుంది.హాంకాంగ్ పూర్తి స్వాతంత్ర దేశంగా ఉన్నా కూడా ఇంకా కొన్ని విషయాల్లో చైనా కనుసన్నల్లోనే ఉండాల్సి వస్తుంది.
తాజాగా నేరస్థుల అప్పగింత బిల్లును తీసుకు వచ్చిన హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.చైనా చెప్పిన ప్రతి దానికి తల ఊపాల్సిన అవసరం ఏంటీ అంటూ అంతా అనుకున్నారు.
కాని బయటకు వచ్చి ఉద్యమం చేసేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు.ఆ సమయంలోనే ఉద్యమంను మొదలు పెట్టిన వ్యక్తి జాషువా వాంగ్.
కేవలం 22 ఏళ్ల వయసు ఉన్న ఈ కుర్రాడు దేశ అధ్యక్షురాలికి వ్యతిరేకంగా గళం ఎత్తాడు.

అతడి మాటలకు ఎన్నో లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు.అతడు చెప్పిన విషయాలను గుర్తించని జనాలు ఆందోళన చేసేందుకు ముందుకు వచ్చారు.లక్షల మంది రోడ్లపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో హాంకాంగ్ అధ్యక్షురాలు నేరస్థుల అప్పగింత బిల్లును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు.
అయినా కూడా చైనా ఆంక్షలను దేశంలో పూర్తిగా పాలద్రోలేందుకు జాషువా గట్టి ఉద్యమం చేస్తున్నాడు.బిల్లును వ్యతిరేకిస్తూ ప్రారంభం అయిన ఉద్యమం ఇప్పుడు దేశ ఉనికి కోసం అన్నట్లుగా మారింది.

ఆందోళన నేపథ్యంలో జాషువా జైలుకు వచ్చాడు.అయినా కూడా ఆందోళనలు మాత్రం వదలడం లేదు.తనకు ఎలాంటి శిక్ష పడ్డా పర్వాలేదు కాని తాను మాత్రం ఉద్యమం కొనసాగిస్తానంటూ దేశ ప్రజలందరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు.అతడు తీసుకున్న నిర్ణయం చాలా బలమైనది, అతడి ఆశయం గొప్పది కనుక అతడి వయసును చూడకుండా జనాలు అతడి వెంట నడుస్తున్నారు.