టీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఐటీఐలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వరంగల్ లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కాలేజీలలో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తి కల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.కాగా దరఖాస్తులకు ఈనెల 31వతేదీ వరకు గడువు ఉంది.
ఈ క్రమంలోనే ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.