సామాన్యులకే కాదు ఒక స్థాయిలో ఉన్న వాళ్లకు కూడా అవమానాలు బాగా ఎదురవుతూ ఉంటాయి.ఎవరైనా సరే దేనినైనా తట్టుకుంటారు కానీ అవమానాన్ని, పరువును అసలు తట్టుకోలేరు.
కొన్ని కొన్ని సార్లు వారికి ఆ అవమానాలే ఆయుధాలుగా మారుతూ ఉంటాయి.ఇటువంటివి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు చాలా వరకు చెబుతూ ఉంటారు.
తమకు గతంలో అవమానాలు జరిగాయని వాటినే ఆయుధంగా చేసుకున్నామని అంటుంటారు.అయితే తమన్నా( Tamanna ) విషయంలో కూడా ఇటువంటిదే ఘోర అవమానం జరిగింది.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓ రేంజ్ లో రాజ్యమేలుతుంది తమన్నా.
మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొని తన పాల అందాలతో ప్రతి ఒక్కరి తన అందాల వలలో చుట్టేసింది.కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలలో చేసిన తమన్నాకు మొదట్లోనే దశ తిరిగే సినిమాలు ముందుకు వచ్చాయి.
అంతే ఇక అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మంచి సక్సెస్ లు అందుకునే వరకు ప్రయత్నించింది.మొత్తానికి స్టార్ హీరోయిన్లలో తను కూడా ఒకరని చెప్పాలి.
పారితోషకం( Remuneration ) ఎక్కువ తీసుకునే హీరోయిన్స్ లలో కూడా తమన్నా ఒకరు.అయితే తమన్నా ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొందని తెలిసింది.

రీసెంట్గా తను మీడియా ఇంటరాక్షన్ లో ( Media Interaction ) చాలా విషయాలు పంచుకుంది.తాను సినీ ఇండస్ట్రీకి అడుగుపెడుతున్న సమయంలో తన కుటుంబ సభ్యులు, బంధువులు బాగా వెక్కిరించారని.పోయి పోయి సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావా.ఇక నీ బతుకు బస్టాండే అని ఘోరంగా అవమానించారని.అందరూ తనను అలా అవమానించడంతో తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారని తెలిపింది.

కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆ అవమానాలే ఆయుధంగా మార్చుకోవడమే కాకుండా తన ఇష్ట ప్రకారం తన తల్లిదండ్రులు కూడా తన ఇష్టాలను గౌరవించారని అందుకే తను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపింది.మనం పైకి ఎదుగుతుంటే నలుగురు లాగేసేవాళ్ళు వెనకాలే ఉంటారు అని ఆ విషయం తనకు ఎప్పుడో తెలుసు అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మధ్య తమన్నా బోల్డ్ సీన్స్ లో ( Bold Scenes ) నటిస్తున్న సంగతి తెలిసిందే.ఎవరు ఏమన్నా తన కెరీర్ మరింత ముందుకు సాగాలంటే బోల్డ్ సీన్స్ చేయక తప్పదని నిర్ణయించుకొని ఏ మాత్రం మొహమాటం పడకుండా బోల్ట్ కంటెంట్ లో నటిస్తుంది.ఇక తను బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో( Vijay Varma ) ప్రేమలో ఉందన్న విషయం గత కొన్ని రోజుల నుండి హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం తను బోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో బిజీగా ఉంది.







