నోటరీ స్థలాల క్రమబద్దీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.అయితే నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే 125 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో కట్టుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.గత విచారణలో 125 గజాల వరకు స్టాంపు డ్యూటీ, జరిమానా ఉండదని, అంతకు మించిన స్థలాలకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ వసూలు చేస్తామని జీవో జారీ చేసిందని వెల్లడించారు.
ఇది రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.







