డెలివరీ తర్వాత జుట్టు పల్చగా మారిపోయిందా.. అయితే ఈ హెయిర్ రీగ్రోత్ టానిక్ మీకోసమే!

డెలివరీ( Delivery ) అనంతరం చాలా మంది మహిళలు( Women ) అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది ముందు వరుసలో ఉంటుంది.

హార్మోన్ల మార్పులు, పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం, జుట్టు సంరక్షణలో అశ్రద్ధ వహించడం, ఒత్తిడి తదితర అంశాలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి.

అధిక హెయిర్ ఫాల్ కారణంగా డెలివరీ అనంతరం జుట్టు పల్చగా మారిపోతుంటుంది.అయితే ఈ సమస్యను అధిగమించడానికి బెస్ట్ రీ గ్రోత్ హెయిర్ టానిక్ ఒకటి ఉంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి.

Advertisement

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు కరివేపాకు తో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు వేసి దాదాపు పది, పన్నెండు నిమిషాల పాటు ఉడికించండి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) కలిపితే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకోవాలి.

గంట అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.

పల్చగా ఉన్న కురులు ఒత్తుగా( Thick Hair ) మారతాయి.జుట్టు రాలడం సైతం తగ్గుముఖం పడుతుంది.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
చర్మవ్యాధుల‌కి బొప్పాయితో పరిష్కారం

ఆ టానిక్ ను వాడ‌టంతో పాటు ఆకుకూరలు, ప్రోటీన్, విటమిన్ ఇ, విటమిన్ డి మరియు బియోటిన్ ఉండే ఆహార పదార్థాలు చేర్చుకోండి.నిద్ర సరిపడుగా ఉండేలా చూసుకోండి.

Advertisement

కెమికల్ ఉత్పత్తులను తగ్గించి నేచురల్ ఆయిల్స్ ఉపయోగించండి.వీల‌నైంత వ‌ర‌కు ఒత్తిడికి దూరంగా ఉండండి.

తాజా వార్తలు