ఈ న్యాచుర‌ల్ ఫేస్ వాష్‌ను వాడితే మొటిమలు, మచ్చలు లేని చర్మం మీసొంతం!

మొటిమలు( pimples ) మరియు ఎటువంటి మచ్చలు లేకుండా ముఖ చర్మం మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

ముఖ్యంగా ఆడవారు అటువంటి స్కిన్ ను పొందడానికి ఎంత కేర్ తీసుకుంటారో, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ను వాడతారో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అయినా సరే కొందరికి ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ ఫేస్ వాష్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నిత్యం ఈ ఫేస్ వాష్ ను ఉపయోగిస్తే మీ ముఖంపై ఒక్క మొటిమ, మచ్చ కూడా ఉండదు.ఫేస్ వాష్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), గుప్పెడు బాగా ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు( Orange peels ) వేసుకోవాలి.

అలాగే ప‌ది బాదం గింజలు( Almonds ), ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు( rose petals ) మరియు వన్ టీ స్పూన్ పెసలు వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

Advertisement

నిత్యం ఫేస్ వాష్ కు ఈ పౌడర్ ను ఉపయోగించాలి.

ఈ ఫేస్ వాష్ పౌడర్ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజుకు వన్ టీ స్పూన్ చొప్పున తయారు చేసుకున్న పౌడర్ ను తీసుకుని అందులో వాటర్ లేదా రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ న్యాచురల్ ఫేస్ వాష్ పౌడర్ ను ఉపయోగించడం వల్ల చర్మ కణాల్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి పోతుంది.మృత కణాలు తొలగిపోతాయి.చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.

మొటిమల సమస్యకు అడ్డుకట్ట పడుతుంది.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్

అలాగే ఈ ఫేస్ వాష్ పౌడర్ చర్మం పై ఏర్పడిన మొండి మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుతుంది.అంతేకాకుండా ఈ ఫేస్ వాష్ పౌడర్ చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.

Advertisement

టాన్ రిమూవ్ అవుతుంది.ముడతలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా సైతం ఉంటాయి.

తాజా వార్తలు