ట్రంప్ పరువు నడిరోడ్డుపై పోయిందిగా!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి దాదాపు 200కు పైగా దేశాలను అతలాకుతలం చేస్తోంది.

ఇప్పటకే ఈ వైరస్ బారిన పడిన వారు వేల సంఖ్యలో మృతి చెందడంతో అన్ని దేశాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి.

మెజారిటీ దేశాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించాయి.ఇక ప్రపంచంలోనే అత్యధిక కరోనాప పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా అగ్రస్థానంలో అగ్రరాజ్యం అమెరికా నిలిచింది.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ను నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అంటున్నారు.కానీ అక్కడ కరోనా వైరస్‌పై సరైన అవగాహన, నివారణ చర్యలు లేకపోవడంతో కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరుకుంది.

దీంతో దేశవ్యాప్తంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ వైరస్‌ను నివారించే చర్యలపై ముందుచూపు లేకపోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అటు కొందరు డొనాల్డ్ ట్రంప్‌పై నిరసనలు కూడా తెలుపుతున్నారు.కాగా న్యూయార్క్ నగరంలోని యూనియన్ స్వార్‌లో కొందరు డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్త పరుస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేశాధినేత పరువును ఇలా కొందరు నడిరోడ్డుపై తీశారు.

కాగా సోషల్ మీడియాలో ట్రంప్‌పై పలు విమర్శలతో కూడిన పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు