సాక్ష్యం చెప్తావా...అధికారి ఉద్యోగం ఊడపీకిన ట్రంప్..

గడించిన నెల రోజులుగా ట్రంప్ పై అభిశంసన విషయం ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది.

అమెరికా చరిత్రలో అభిశంశించబడిన అధ్యక్షులలో ట్రంప్ మూడవ వ్యక్తి అంటూ ఇంటర్నేషనల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

చివరికి ఎట్టకేలకి అభిశంసన విచారణం సెనేట్ లోకి వచ్చే సరికి వీగిపోయింది.చివరికి ట్రంప్ డెమొక్రాట్ల పై పై చేయి సాధించాడు.

అయితే సెనేట్ లో రిపబ్లికన్ నేతలు మద్దతు అధికంగా ఉండటం వలనే ట్రంప్ అభిశంసన నెగ్గాడు అనే విషయం అందరికి తెలిసిందే.ఈ తీర్పు తరువాత ట్రంప్ తన దూకుడు మరింతగా పెంచేశాడు.

ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పట వరకూ కూడా తనకి ఎదురు చెప్పిన ఎటువంటి అధికారినైనా, లేదా నేతలని అయినా సరే బలవంతంగా రాజీనామాలు చేయించిన ట్రంప్ వారిపై చిన్న చిన్న విషయాలకే వేటు వేసిన సందర్భాలు అనేకం.తన కూతురు గారాల పట్టి ఇవాంకా కి ఎదురు చెప్పిందనే కారణంగా ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ నే తీసి అవతల పడేశాడు.

Advertisement

తన నిర్ణయాలకి విరుద్దంగా ప్రవర్తిస్తున్నాడు అనే కారణంగా రక్షణ శాఖ ముఖ్య అధికారులని పక్కన పెట్టేశాడు.ఇలా ఎన్నో ఎన్నెన్నో సంచలన ఏక పక్ష నిర్ణయాలు ట్రంప్ తీసుకున్నాడు.ఈ క్రమంలోనే

మొన్నటి అభిశంసన సమయంలో ట్రంప్ పై ప్రతినిధుల సభలో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వైట్ హౌస్ అధికారి అలెగ్జాండర్ విండ్ మన్ పై వేటు వేశారు.ఆయన్ని భాద్యతల నుంచీ తప్పిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించడంతో విండ్ మన్ తరుపు న్యాయవాది ఇది ప్రతీకార చర్య అంటూ ఆయన వాపోయారు.ఈ విషయంపై ఇప్పటి వరకూ అలెగ్జాండర్ స్పందించలేదు.

అయితే ట్రంప్ ఇలా ప్రతీ ఒక్కరిపై వేటు వేయడం భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు.

ఫస్ట్ క్లాస్ టికెట్ కుక్కకిచ్చారు.. ప్రయాణికుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి!
Advertisement

తాజా వార్తలు