తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానంపై రాష్ట్రప్రభుత్వం కొరడా ఝులిపించింది.ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తు్న్న పాఠశాలల అరాచకాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం పారదర్శకత కలిగిన కొన్ని నిభంధనలను ప్రకటించింది.
దీంతో విద్యుర్ధుల తల్లిదండ్రల్లోనూ, అటు అధ్యాపకుల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది.
తెలంగాణ లో ప్రైవేటు పాఠశాలలు, విద్యార్షుల తల్లిదండ్రుకు మోయలేని గుదిబండగామారుతున్నాయి.
కాస్త డబ్బులు సంపాదించే మధ్యతి కుటుంబాలు వరకూ ఫర్వాలేదు అనిపించే విధంగా ఉన్న కొన్ని పాఠశాలలు మినహా.పేరు చెప్పకూడని ,అందరికీ తెలిసిన ప్రముఖంగా గుర్తింపు పొందిన కొన్ని పాఠశాలలు, మాత్రం విద్యార్ధుల పాలిట శాపాలుగా మారుతున్నాయనడంలో సందేహంలేదు.
రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా విధానం సరిగా లేక పోవడంతో కష్టమైనా, ఇష్టంగానే మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేటు పాఠశాలలవైపు దృష్టి సారిస్తున్నాయి.దాంతో తల్లిదండ్రుల పల్స్ పూర్తిగా చదివేసిన స్కూల్స్, నిలువు దోపిడీకి పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యతరగతి కుటుంబాలకే మోయలేని భారమవుతున్న పాఠశాలల ఫీజులు.ఇక పేదవారికి అందని ద్రాక్ష పండును తలపిస్తున్నాయి.
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్న చందాన.ప్రైవేటు పాఠశాలలు పుల్లగా ఉంటాయనుకుంటూ ప్రభుత్వ పాఠశాలలనే ఆశ్రయిస్తున్నారు.
దాంతో ప్రభుత్వం అడపా దడపా విధానాలు మార్చినా.అవి సరైన ఫలితాలు ఇవ్వడంలేదనేది జగమెరిగిన నగ్న సత్యం.

ఇక ప్రైవేటు విధ్యావిధానం ఓ మహా ప్రవాహం అనుకున్న ప్రభుత్వం, తల్లిదండ్రుల సంక్షేమం వైపు ద్రుష్టి సారించింది.తాజా సమాచారం ప్రకారం నిలువు దోపిడీకి పాల్పడుతున్న పాఠశాలలకు కొన్ని పారదర్శక ఉత్తర్వూలను జారీ చేసింది.జీ ఓ ఎమ్మెస్ నెంబర్ 1,.! తేదీ 1-జనవరి-1994 ప్రకారం పాఠశాలలు, ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలనేది మొదటి కండిషన్.వసూలు చేసిన ఫీజుల్లోనుంచి 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాల్సి ఉంటుంది.ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలి.
ఇక రెండోది.జీ ఓ ఎమ్మెస్ నెంబర్ 42, తేదీ 30 జులై 2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ డీఎఫ్ ఆర్ సీ అనుమతి తీసుకోవాలి.
ఇక జీ ఓ ఎమ్మెస్ నెంబర్ 246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.సీబియస్ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్ , టీచర్, అసోసియేషన్’ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ అసోసియేషన్లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి.వీరిని సంప్రదిన్చిన తరువాతనే ఫీజులను పెంచాలి.
మరో వైపు జీ ఓ ఎమ్మెస్ నెంబర్ 91, తేదీ 6 ఆగష్టు 2009 ప్రకారం వన్ టైం ఫీజుగా అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి.రిజిస్ట్రేషన్ ఫీజు 5 వందల రూపాయలు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ ఫీజు 5వేలకు మించకుడా వసూలు చేయాలి.
జీవోలోని సెక్షన్ 1సీ ప్రకారం పాఠ్యపుస్థకాలను, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే వాటినే కొనాలని నిబంధనలు పెట్టకూడదంటూ హెచ్చరించింది.పుస్థకాల అమ్మకాలకు కౌంటర్లను ఏర్పాటు చేయకూడదంటూ నిబంధనలు విధించింది తెలంగాణ సర్కార్.

ఇక చివరగా సీ అండ్ డీఎస్ ఈ పీఆర్ ఓసీ , ఆర్ సీ నెంబర్ 780 , తేదీ 16,మే 2013 ప్రకారం సెక్షన్ 8లో ఒకటవ ఆర్టికల్ ప్రకారం ప్రకారం పాఠశాలల బోర్డులపై యజమాన్యం రాస్తున్న టైటిల్స్ పైనా ప్రభుత్వం తోకలు కట్ట్ చేసింది.తాజా గా ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్యూలు ప్రకారం పాఠశాలల పేర్లు చివరన ఇంటర్నేషనల్, ఐఐటి, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈటెక్నో అనే తోకలేవి తగిలించకూడదంటూ స్పష్టం చేసింది.కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కోనాలని యాజమాన్యానికి అర్ధమయ్యేలా విడమర్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.
ఇదంతా చూస్తుంటే భారీ ఎత్తున రాష్ట్రంలోని రాష్ట్రీయ, జాతీయ పాఠశాలలపై డేగ కన్నే వేసిందనడంలో సందేహంలేదు.
దొరికిందే సందుగా విద్యార్ధుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న పాఠ శాలలకు ఈ ఉత్తర్యూలు నిజంగానే అశని పాతమనే చెప్పాలి.ఆవంక, ఈవంకా అని ఏదో సాకులు పెట్టి, రూపాయి ఖర్చుకు పదివేలు ఫీజులు డిమాండ్ చేస్తున్న ఆయా పాఠశాలల యాజమాన్యాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.







