జానారెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్ రాజకీయం... అసలు వ్యూహం ఇదే

అన్ని పార్టీల కన్నా నాగార్జున సాగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కంటే ముందు బీజేపీపై ప్రధానంగా దృష్టి పెట్టిన తెరాస ఇక బీజేపీ ప్రభావం తెలంగాణలో అంతగా లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పై ప్రధానంగా దృష్టి పెట్టింది టీఆర్ఎస్.దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు కొంత నిరాశపరచడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇక ఈ విజయం టీఆర్ఎస్ లో జోష్ నింపిందనే చెప్పవచ్చు.ఇక ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిస్తే ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారనే భావన ప్రజలకు కల్పించవచ్చని,తద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఏర్పడుతుందనేది టీఆర్ఎస్ వ్యూహంలా అనిపిస్తోంది.

అయితే టీఆర్ఎస్ బలాన్ని మొత్తం నాగార్జున సాగర్ కు తరలించి ప్రచారంలో సైతం ముందుండేలా ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ ముఖ్య నాయకులను నాగార్జునసాగర్ లో ప్రచారంలో కెసీఆర్ దింపిన పరిస్థితి ఉంది.ఇక జానారెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్ లు తాము ముందుగా అనుకున్న వ్యూహ రచనను అమలు చేస్తున్నారు.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు