ఎంఐఎం పార్టీ-టీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా మంచి దోస్తులనేది జనం మాట.కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం మేము దోస్తులం కాము.
ప్రత్యర్థులమని చెప్తున్నారు.అయితే ఈ రెండు వాదనలు ఎలా ఉన్నా కానీ ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి అవగాహన ఉందో లేదో.
అది బహిరంగ రహస్యమే.తెలిసిందే.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఈమధ్య ఓ ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.ఎంఐఎంకు మాకు అవగాహన ఉందంటున్నారు కొందరు.
గత గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీ నుంచి మేము 5 సీట్ల వరకు గెలుచుకున్నాం.ఈ సారీ 10 సీట్లను కైవసం చేసుకోబోతున్నామని వ్యాఖ్యలు చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది.కానీ గ్రేటర్ ఎన్నకల్లో టీఆర్ఎస్ పార్టీ 150 డివిజన్లలో పోటీ చేస్తోంది.గెలుపే లక్ష్యంగా కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొంటున్నారు.ఎంఐఎం ఈ సారి 51 స్థానాల్లో పోటీ చేస్తోంది.
అయితే కేటీఆర్ రోజుకీ నాలుగైదు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటున్నా తన ప్రచారం కేవలం పాతబస్తీ మినహాగానే సాగుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది.ఎంఐఎంకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపినప్పటికినీ కేవలం ఆ ప్రాంతంలో ఫ్రెండ్లీ పోటీ మాత్రమే ఉందని, అది కూడా నామ్‌కే వాస్తే పోటీనే జరుగుతుందనే అభిప్రాయాన్నిరాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లుండితో ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది.100 నుంచి 105 స్ధానలే లక్ష్యంగా కేటీఆర్, టీఆర్ఎస్ నాయకుల ప్రచారం జరుగుతోంది.దాదాపు ఎంఐఎం పోటీ చేస్తున్న 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉండబోదనే చర్చ జరుగుతోంది.ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉంది.దీంతో ఇంకెప్పుడు పాతబస్తీలో టీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలను నిర్వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే పాతబస్తీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు ఎంఐఎంకు పోటీగా తమ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రచారం చేసే అభ్యర్థులను ప్రోత్సహించాల్సిన నేతలు పైగా అసలు మీరు ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారని పార్టీ పెద్దలు తమను హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తున్నాయి.టీఆర్ఎస్-ఎంఐంఎ ఫ్రెండ్లీ ఫైట్‌లో భాగంగానే ఈ రకమైన అవగాహనను ముందస్తు ఆ రెండు పార్టీల నేతలు కుదుర్చుకుని ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.