టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది.శాసన మండలిలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఉప ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కారణంగా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది.కొండ మురళి కొన్నాళ్ల క్రితం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

ఇక టీఆర్‌ఎస్‌కు చెందిన పట్నం నరేందర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కారణంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.ఇప్పుడు ఈ ముగ్గురి స్థానంలో కొత్త వారి ఎంపిక ఎన్నికలు జరుగబోతున్నాయి.

Advertisement

టీఆర్‌ఎస్‌ మూడు స్థానాలకు కూడా పోటీ చేసేందుకు సిద్దం అవుతోంది.సీఎం కేసీఆర్‌ సౌత్‌ రాష్ట్రాల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నాడు.

ఈ సందర్బంగా పార్టీ నాయకులు మరియు మంత్రులతో కలిసి ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ అభ్యర్థుల గురించి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గుత్తా సుకేందర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలను పోటీలో నిలుపబోతున్నారు.

సిట్టింగ్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు