తెలంగాణా ఉద్యమ చరిత్రలో స్పెషల్ డే

ఈ రోజు నవంబర్ 29.అవును .

అయితే ఏమిటి ? మనం చెప్పుకునే జవాబు ఇది.

కానీ తెలంగాణా వాదులకు, ప్రధానంగా గులాబీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇది మర్చిపోలేని రోజు.ఈ ప్రత్యేకత ఏమిటో మీడియాలో ఏమీ రాలేదు .కానీ ఒక గులాబీ నాయకుడు చెప్పగానే నిజమే కదా అనిపిస్తుంది.అలాగే ఇది వివాదాస్పదమైన రోజు కూడా.

ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే .ప్రత్యేక తెలంగాణా కోసం కెసీఆర్ 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష ప్రారంభించి 11 రోజుల పాటు కొనసాగించారు.ఈ దీక్ష కారణంగానే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రకటించింది.

కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల్లో అది వెనక్కు పోయింది.అప్పటిలో కెసీఆర్ దీక్ష పెద్ద సంచలనం కలిగించింది.అప్పుడు ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నారు.

Advertisement

ఇది నిజమైన నిరాహార దీక్ష కాదని కొందరు విమర్శించారు.మొన్న వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి కెసీఆర్ దొంగ నిరాహార దీక్ష చేసాడని, దీన్ని నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు.

అది నిజమైన దీక్ష అయినా , దొంగ దీక్ష అయినా ఉద్యమ చరిత్రలో అది చెప్పుకోదగ్గ ఘట్టం .ఈ ప్రత్యెక రోజును పురస్కరించుకొని కొందరు గులాబీ పార్టీ నాయకులు వరంగల్లులోని వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు