ఎన్నికల్లో అపజయం ఎదురైతే ఏవేవో కారణాలు చెప్పే రాజకీయ పార్టీలు ఒక్క విజయం దక్కితే చాలు రెచ్చిపోతాయి.ప్రస్తుతం తెలంగాణలో గులాబీ పార్టీ విజయ గర్వంతో ఉరకలు వేస్తోంది.
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఘన విజయం గులాబీ పార్టీలో విపరీతమైన ఆత్మ విశ్వాసం నింపింది.రాబోయే రెండు ఎన్నికల మీద కూడా గులాబీ పార్టీ ధీమాగా ఉంది.
అవి … గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు.ఈ రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని గులాబీ పార్టీ పట్టుదలగా ఉంది.
సాధిస్తామని చెబుతోంది కూడా.గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చరిత్ర ఉంది.
తన బలానికి మించి అభ్యర్థులను నిలబెట్టినా విజయం దక్కించుకోగలిగింది.టీడీపీ ఒక్క అభ్యర్థి ఓటు కోసం కోట్లు ఆఫర్ చేసి, కెమెరాకు చిక్కి పరువు పోగొట్టుకుంది.
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు తేదీ ఖరారు అయ్యింది.ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 12 స్థానాలకు పోటీ చేస్తోంది.
వాస్తవానికి శాసన మండలిలో 9 స్థానాలు ఉండగా రాష్ట్ర విభజన తరువాత 3 స్థానాలు అదనంగా వచ్చాయి.ఈ అన్ని స్థానాలకు పోటీ చేయాలని అధికార పార్టీ నిర్ణయించింది.
గులాబీ పార్టీ 5 స్థానాలు తప్పనిసరిగా గెలుస్తుంది.కానీ వరంగల్ విజయం తరువాత అన్ని స్థానాలకు పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.
ఇది ఎలా సాధ్యం అవుతుందో చూడాలి.ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్న్జికల్లో గెలుపుపై అధికార పార్టీకి నమ్మకం కుదిరింది.
వరంగల్ ఓటర్లు గెలిపించారు కాబట్టి హైదరాబాదు ప్రజకు కూడా తప్పక గెలిపిస్తారనే నమ్ముతోంది.లానీ ప్రతిపక్షాలు మాత్రం హైదరాబాదులో అధికార పార్టీ గెలవలేదని గట్టిగా చెబుతున్నాయి.
గత సాధారణ ఎన్నికల్లో నగరంలో గులాబీ పార్టీ సత్తా చాటలేకపోయింది.