సినిమా గురించి మాట్లాడకుండా ఈ సోది ఏంటి భయ్యా..!

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ తాజాగా జరిగింది.

నాని ముఖ్య అతిథిగా ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను నిర్మిస్తున్న సుధాకర్‌ ప్రస్తుతం నాని హీరోగా దసరా సినిమా ను నిర్మిస్తున్నాడు.

అందుకే నిర్మాతల రిక్వెస్ట్‌ మేరకు నాని వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన వారు చాలా సమయం మాట్లాడటం జరిగింది.

కాని వారిలో ఎక్కువ శాతం రామా రావు ఆన్ డ్యూటీ ఎలా ఉండబోతుంది.ఎందుకు ఈ సినిమా ను జనాలు చూడాలి అనే విషయాన్ని చెప్పకుండా ఒకరి గురించి ఒకరు డబ్బా కొట్టుకోవడమే సరి పోయింది.

Advertisement

అలాంటి మాటలు సక్సెస్ మీట్‌ లో చెప్పుకుని ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో సినిమా యొక్క ఎలిమెంట్స్ ను చెప్పుకుంటూ వెళ్లాలి.అంతే తప్పక రవితేజ గురించి శరత్‌.

శరత్‌ గురించి మరొకరు డబ్బా కొట్టడానికి కాదు.చివరకు నాని వచ్చి కూడా సినిమా గురించి ఎక్కువ మాట్లాడకుండా ఒక్క ముక్కలో చెప్పేశాడు.

రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను చాలా బాగా ప్రమోట్‌ చేస్తున్నామని యూనిట్‌ సభ్యులు అనుకుంటున్నారు కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఎక్కువగా సినిమా గురించి మాట్లాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

రవితేజ సినిమా లోని తన పాత్ర ఏంటీ.కథ ఏంటీ.దర్శకుడు కథను ఎలా డీల్‌ చేశాడు అనే విషయాలను చెప్పాల్సి ఉంది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఇక దర్శకుడు కథ కు రవితేజ ఎలా సూట్ అయ్యాడు.ఐటెం సాంగ్‌ ను ఎందుకు పెట్టారు.

Advertisement

సంగీతం ఎలా ఉండబోతుంది అనే విషయాలను చెప్పి ఉంటే బాగుండేది అంటూ సోషల్‌ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.తదుపరి సినిమా లకైనా ఇలా సోది ఉండకుండా చూసుకోండి భయ్యా అంటూ కొందరు ట్వీట్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు