ఇన్నాళ్లు యాంకర్ గా అదరగొట్టిన సుమ కెరియర్ లో ఫస్ట్ టైం ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీ లో నటించింది.జయమ్మ పంచాయతీ అంటూ ఓ సాహసమే చేస్తున్న సుమ సినిమా మీద చాలా నమ్మకంగా ఉంది.
టీవీ షోలే కాదు స్టార్ సినిమా నుండి యంగ్ హీరో సినిమా వరకు ఈవెంట్ అంటే సుమ ప్రత్యక్షం అవ్వాల్సిందే.సినిమా రిలీజ్ ఈవెంట్ కు సుమ రావడం కూడా కొందరు లక్ గా ఫీల్ అవుతారు.
స్టార్ యాంకర్ గా తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న సుమ మళ్లీ యాక్షన్ లోకి దిగింది.
అయితే జయమ్మ పంచాయతీ సినిమా కంటెంట్ తనకు బాగా నచ్చడంతో సుమ ఈ మూవీకి ఒప్పుకుందని తెలుస్తుంది.
అయితే సుమలో ఈ సీరియస్ యాంగిల్ చూసి ఖచ్చితంగా త్రివిక్రం తన సినిమాల్లో ఓ పవర్ ఫుల్ రోల్రా సే అవకాశం ఉంటుంది.తన సినిమాల్లో పాత తరం హీరోయిన్స్ ని రీ ఎంట్రీ ఇప్పించి వాళ్లకి బలమైన పాత్రలు ఇచ్చే మన మాటల మాంత్రికుడు త్రివిక్రం సుమకి కూడా ఏదైన స్టార్ హీరో సినిమాలో మంచి పాత్ర ఇస్తారని ఆశించవచ్చు.
ఆయన అనుకోవాలే కాని పాత్ర రాదా.ఆయన అడగాలే కాని సుమ చేయదా.
సో ఈ కాంబో సెట్ అవ్వాలని ఆశిద్దాం.