మాటల రచయితగా ఉన్న త్రివిక్రం తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా నువ్వే నువ్వే.ఈ సినిమా రీసెంట్ గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ షో వేశారు.చిత్రయూనిట్ అంతా ఆ షోలో పాల్గొన్నారు.ఆ సినిమా జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.ఈ ప్రెస్ మీట్ లో త్రివిక్రం ఇప్పుడు స్టార్స్ తో తీస్తున్న ఆయన స్టార్ డైరక్టర్ అయినా ఆయన తొలి సినిమా హీరో నేనే అని చెప్పడం బాగుంది.
ఒకప్పుడు లవర్ బోయ్ కెరియర్ తో దూసుకెళ్లిన తరుణ్ ఇప్పుడు ఫేడవుట్ అయ్యాడు.
దాదాపు హీరోగా అతని కెరియర్ ముగిసిందని చెప్పొచ్చు.అయితే నువ్వే నువ్వే టీం ఈవెంట్ లో తరుణ్ కి మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది.
తరుణ్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడా లేక ఆయన పర్యవేక్షణలో సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.తొలి సినిమా హీరో కాబట్టి అతని మీద ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది.
అందుకే తరుణ్ కి త్రివిక్రం హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడు.స్రవంతి రవికిశోర్, త్రివిక్రం కలిసి మళ్లీ తరుణ్ తో సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.