ఏడుపాయల వన దుర్గ ఆలయం మూసివేత భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు.సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
దీంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది.ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.
ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు అధికారులు.రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.







