తారక్-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఆరోజే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండటంతో ఆయన ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన త్రివిక్రమ్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యాకే త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు.

దీంతో ఈ సినిమాను అక్టోబర్ 1న సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.కాగా ఈ సినిమాను ఏప్రిల్‌లోనే పట్టాలెక్కించాల్సి ఉన్నా, లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.

Advertisement

దీంతో ఇప్పుడు ఎలాగైనా అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్థినకు అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.మరి ఇప్పుడైనా అనుకున్నట్లుగానే అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు