20 ఏళ్లుగా సౌత్ ఆడియన్స్ ని అలరిస్తున్న త్రిష ఇప్పటి స్టార్ హీరోయిన్స్ కి ధీటుగా సినిమాలు చేస్తుంది.ఇప్పటికీ ఆమె తన ఫాం కొనసాగిస్తుంది అంటే అమ్మడి టాలెంట్ గుర్తించాల్సిందే.
రీసెంట్ గా మణిరత్నం పి.ఎస్ 1 లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన త్రిష ఇక మీదట వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.మొన్నటిదాకా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన అమ్మడు ఇప్పుడు ఎలాటి సినిమా అయినా ఓకే అనేస్తుంది.
ఇక లేటెస్ట్ గా త్రిషకు రెండు లక్కీ ఛాన్స్ లు వచ్చినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ మూవీలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు అజిత్, విఘ్నేష్ శివన్ కాంబో సినిమాలో కూడా త్రిష ఛాన్స్ అందుకుందట.
విజయ్, అజిత్ లతో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు నటించిన త్రిష మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటిస్తుంది.త్రిష ఫాం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పొచ్చు.కేవలం కోలీవుడ్ సినిమాలే చేస్తూ వస్తున్న త్రిష టాలీవుడ్ ఛాన్స్ లను స్కిప్ చేస్తుంది.కారణం తెలియదు కానీ అమ్మడు కేవలం మాతృ భాషలోనే నటించాలని అనుకుంటుందట.







