నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.
సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా ఇటీవలే స్టార్ట్ చేసారు.
ఇప్పటికే సీజన్ 2 నుండి వచ్చిన ఎపిసోడ్స్ అందరిని ఆకట్టు కున్నాయి.
ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోలో పాల్గొనడం అందరికి ఆసక్తిగా మారింది.
ఈయన ఎపిసోడ్ డిసెంబర్ 31 కి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.ఇక ఇప్పుడు ఈ షో గురించి మరొక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన బోతున్నారు అనే టాక్ గత కొన్ని రోజులుగా వినిపిస్తునే ఉంది.
ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో పాటు క్రిష్ కూడా గెస్టులుగా రాబోతున్నారు అని తెలుస్తుంది.
మరి తాజాగా ఈ ఎపిసోడ్ షూట్ ఎప్పుడు చేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చేసింది.ఈ ఎపిసోడ్ ఈ నెల 27న అంటే రేపు మంగళవారం నాడు షూట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.
మరి ఈ ఎపిసోడ్ షూట్ కోసం హరిహర వీరమల్లు సినిమాకు బ్రేక్ ఇచ్చి మరీ బాలయ్య షోలో పాల్గొన బోతుండడం విశేషం.

ఇక ప్రెజెంట్ బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ట్రై చేస్తున్నాడు.అలాగే పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.







