Trisha : నేను చాల మందితో డేట్ చేశాను..కానీ వర్క్ అవుట్ కాలేదు : త్రిష

త్రిష( Trisha ).దశాబ్ద కాలంగా సినిమా ఇండస్ట్రీలోనే పాతుకుపోయిన హీరోయిన్.

రోజురోజుకీ అందాన్ని పెంచుకుంటూ ఈమె నలభై ఏళ్ల హీరోయినేనా అని అనిపించేంత అద్భుతమైన అందం కలిగి తనని తాను మేకోవర్ చేసుకుంటూ ఉంటుంది.సినిమాల పరంగా ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది.

సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరుగుతున్న చాలా అది తక్కువ మంది హీరోయిన్స్ లలో త్రిష ఉంటారు.

అయితే త్రిష ఇన్నేళ్లయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.పెళ్లి మాట ఎత్తిన ఆమె దాటవేస్తూ కూడా ఉంది.

Advertisement

గతంలో ఓసారి నిశ్చితార్థం( Engagement ) జరిగి అది బ్రేకప్ కూడా అయింది.

ఆ తర్వాత ఆమె పెళ్లి ఉసు ఎత్తడం లేదు.అయితే ఇటీవల ఒక మీడియా సంస్థకి ( media company )ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చాలా ఓపెన్ గా తన జీవితంలో జరుగుతున్న విషయాల గురించి వివరణ ఇచ్చారు.అదేంటంటే తాను అనేక మందితో డేటింగ్ చేశానని, రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నాను అని, కానీ ఇప్పటి వరకు ఏదీ కూడా ముందుకు వెళ్లలేదని, ఇలా రకరకాల వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా లేదని, పెళ్లి అంటే ఒక బాధ్యత అని, అది తన వల్ల అవుతుందో కాదు అని అనుమానం కూడా ఒక దశలో వచ్చిందనే త్రిష చెప్పారు.

ఇప్పుడున్న వయసులో ఖచ్చితంగా తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటున్నానని సెల్ఫ్ లవ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఒకరి కోసం జీవించడం కన్నా తమ కోసం తాము జీవించడంలో ఒక అర్థం ఉంటుందని త్రిష చెబుతోంది.

దీన్ని బట్టి చూస్తే త్రిష జీవితంలో చాలాసార్లు ప్రేమ, పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది.మరి ఇకనైనా ఆమెకు నచ్చేవాడు దొరుకుతాడో లేదో కొన్నాళ్లు వేచి చూస్తే తెలుస్తుంది.సినిమాల విషయానికొస్తే ఆమె చిరంజీవి విశ్వంభర సినిమా ( Visvambara movie )లో నటిస్తోంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

తమిళ్లో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న విడా ముయచి అనే ఒక చిత్రంలో కూడా నటిస్తోంది.అలాగే మలయాళంలో రామ్ అనే మోహన్ లాల్ చిత్రం తో పాటు ఐడెంటిటీ అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.

Advertisement

ఇక కమల్ హాసన్ సరసన తగ్ లైఫ్ సినిమాలో కూడా నటిస్తోంది త్రిష.

తాజా వార్తలు