ఈ తాబేలు మైండ్ చాలా షార్ప్ గురూ...!

ఈ మధ్య కాలంలో కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

 Video Of Turtle Using Toy Car To Move Around, Viral Video, Turtle On Car, Socia-TeluguStop.com

మామూలుగా తాబేలు నడక అందరికీ ఎంత స్పీడో తెలిసిందే.అందుకేనేమో తాను వేగంగా వెళ్లేందుకు ఒక కారును ఉపయోగించుకుంది తాబేలు.

కాకపోతే, ఆ కారుకు డ్రైవర్ కూడా అవసరం లేదండోయ్… తానే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తోంది.

ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

తాబేలు కారు నడుపుతుందంటే అదేదో డీజిల్ పోసి నడిపే కారు కాదండోయ్.కేవలం పిల్లలు ఆడుకునే కార్ బొమ్మ మాత్రమే.

దాంతో కూడా ఆ తాబేలు డ్రైవింగ్ చేస్తుందంటే ఆ తాబేలు తెలివిని నిజంగా మెచ్చుకోవాల్సిందే.ఆ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే.

మీరు కూడా ఆ వీడియో చూస్తే అవురా అనాల్సిందే….

ఈ వీడియోను ఎర్త్ బ్యూటీ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడినది.

ఈ వీడియోలో మొదట తాబేలు కార్ మీద పడుకొని కాళ్ల సాయంతో కాస్త దూరం మందు దూసుకు వెళ్తుంది.అలా కొద్ది దూరం వెళ్లి మళ్ళీ తన కాళ్లతో స్పీడును పెంచుతోంది.

కారు మీద ఉండడంతో తాబేలు కూడా తెగ స్పీడ్ తో ప్రయాణం చేస్తోంది.ఇలా ప్రయాణించే సమయంలో తాబేలు తెగ ఆనందంగా ఉన్నట్లు కనబడుతుంది.

ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ప్రపంచానికి ఇట్లే తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube