ఇండస్ట్రీ లో సక్సెస్ ఊరికే రాదు అంటున్న టాప్ డైరెక్టర్స్...

సినిమా అంటే చాలు ఇండస్ట్రీ లో చాలా మందికి చాలా రకాలైన ఇష్టాలు ఉంటాయి.

అంటే ఒక్కొక్క జానర్ ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుతుంది ఇక ఈ సినిమాల్లో నటుడుగా మంచి గుర్తింపు రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అలాగే డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.అందుకే ఎవరైనా ఇక్కడికి రావాలంటే చాలా భయపడి పోతుంటారు కానీ కొందరు మాత్రం రిస్క్ చేసి ఇండస్ట్రీ కి వచ్చి మంచి సక్సెస్ లు సాధిస్తారు.

అందులో మనం చెప్పుకునే వ్యక్తులు కొందరు ఉన్నారు.వాళ్లే పూరి జగన్నాథ్( Puri Jagannath ) లాంటి వారు.

వీళ్ళు ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు చాలా దైర్యం గా వచ్చారు కానీ ఇక్కడ సినిమాల కోసం తిరుగుతున్న క్రమం లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు.

Advertisement

అలా వాళ్ళు పడిన ఇబ్బందులను చెప్తుంటే ఒక సగటు మనిషి ఇన్ని బాధలు పడలేడు ఎందుకంటే ఒక పిచ్చి ఉంటేనే ఇలాంటి బాధలు అవమానాలు ఎదురుకుంటారు తప్ప వేరే ఒక సగటు మనిషి ఇలాంటివి ఎదురుకోలేడు అని ఆయన ఇక ఇంటర్వ్యూ లో చెప్పారు.ఇక ఈయన తరువాత ఇండస్ట్రీ లో ఏదో ఒకటి చేసి సక్సెస్ అవ్వాలని శ్రీను వైట్ల( Srinu vaitla ) కూడా ట్రైన్ ఎక్కేసి వచ్చేసి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు కానీ ఈయనకి డైరక్టర్ గా చేయడానికి ఎవరు అవకాశం ఇవ్వకపోవడం తో వాళ్ల ఫ్రెండ్స్ సహాయం తో అప్పు చేసి మరీ నీకోసం అనే సినిమాని చేశాడు.అది ప్లాప్ అయింది కానీ ఆయనకి డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది.

ఇక్కడ రిస్క్ చేస్తేనే మనకు ఒక సినిమా అనేది వస్తుంది.లేకపోతే మనం ఎంత చేసిన ఇక్కడ సినిమా అనేది మనల్ని తన అక్కున చేర్చుకోదు అందుకే బయట నుంచి చూసేవాళ్ళకి సినిమా అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఇండస్ట్రీ లో బాధలు పడిన వారికే ఆ కష్టాల విలువ తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు