ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్ ఇండస్ట్రీలను మన దేశానికి చెందిన వారే ఉన్నారు.ఐబీఎం, అడోబ్, గూగుల్ ఇలా ఎన్నో ప్రముఖ ఇండస్ట్రీలను భారత సంతతికి చెందిన వారే ఏలుతున్నారు.
తాజాగా 2021లో కూడా మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓ స్టీవ్ సంఘీ ఎగ్జిక్యూటివ్ రోల్‌కు సెలెక్ట్ అయ్యారు.గ్లోబల్ గా చూస్తే వివిధ రంగాల్లో 16 మంది ప్రముఖ స్థానాల్లో ఉండి కీ రోల్‌ను పోషిస్తున్నారు.ఆ వివరాలు తెలుసుకుందాం.
సుందర్ పిచ్చాయ్– గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ.

భారత సంతతికి చెందిన సుందర్ పిచ్చాయ్ 2019 నుంచి గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.2014 నుంచి గూగుల్‌కు హెడ్ అయ్యారు.ఈ కంపెనీ ఆండ్రాయిడ్, క్రోమ్, మ్యాప్స్‌కు బిజినెస్‌కు ఇది చాలా ప్రాముఖ్యమైంది.సుందర్ పిచ్చాయ్ ఐఐటీ ఖరాగ్‌పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు.వార్టన్‌లో ఎంఎస్ చదివారు.
సత్య నాదేళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ…

హైదరాబాద్‌లో పుట్టిన సత్యనాదేళ్ల 2014 ఫిబ్రవరి నుంచి మైక్రోసాఫ్ట్‌కు అధినేతగా ఉన్నారు.స్టీవ్ బామర్ తర్వాత ఈయనే ఆ హెడ్ అయ్యారు.సత్య నాదేళ్ల మణì పాల్ యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఎంఎస్ విస్‌కాన్సిన్–మిల్వాకీ యూనివర్శిటీ నుంచి పొందారు.ఎంబీఏ చికాగో బూత్ స్కూల్ బిజినెస్‌లో పూర్తి చేశారు.
మైక్రోసాఫ్ట్ హెడ్‌గా 1992 నుంచి ఉన్నారు.విండోస్ ఎన్‌టీ ఆపరేటింగ్ సిస్టంను అభివృద్ధి చేశారు.
శాంతను నారయణ్, చైర్మన్–ప్రెసిడెంట్, సీఈఓ అడోబ్.

హైదరాబాద్‌కు చెందిన శాంతను నారయణ్ 1998 నుంచి అడోబ్‌కు పెద్దగా వ్యవహరిస్తున్నారు.2005లో ‘కూ’కు వైస్‌ప్రెసిడెంట్‌గా, 2007లో సీఈఓగా ఎన్నికయ్యారు.ఈయన యాపిల్, సిలికన్ గ్రాఫిక్స్‌లో కూడా ప్రముఖ పొజిషన్‌లలో కొనసాగారు.
శాంతను ఉస్మానియా యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.కాలిఫోర్నియా, బెర్కీ›్ల యూనివర్శిటీలో ఎంబీఏ ^è దివారు.ఎంఎస్ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి పొందారు.
అరవింద్ కృష్ణ, ఐబీఎం సీఈఓ.

ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అరవింద్ కృష్ణ 2020 ఏప్రిల్ నుంచి ఐబీఎం సీఈఓగా వ్యవహరిస్తున్నారు.30 ఏళ్లు గా ఐబీఎంలోనే వివిధ పొజిషన్లలో పనిచేశారు.అర్బన్ కాంపెయిన్‌లోని ఇల్లినోయిసెస్ యూనివర్శిటీ నంచి పీఎహెచ్‌డీ పూర్తి చేశారు.
రేవతి అద్వైతి, ఫ్లెక్స్ సీఈఓ…

ఫ్లెక్స్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా ఉన్న రేవతి 2019 నుంచి ఉన్నారు.గతంలో ‘కూ’కు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.బిట్స్‌పిలాని నుంచి బ్యాచిలర్ పట్టా పొందిన ఆమె ఎంబీఏ థండర్ బర్డ్ స్కూల్ నుంచి పొందారు.
నికేష్ అరోరా, చైర్మన్ సీఈఓ, పాలో అల్టో నెట్‌వర్క్.

నికేష్ అరోరా పాలో అల్టో నెట్‌వర్క్ సీఈఓగా 2018 నుంచి ఉన్నారు.గూగుల్, సాఫ్ట్ బ్యాంక్‌లో కూడా పనిచేశారు.ఈయన బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేశారు.బోస్టన్ కాలేజీ, నార్త్ ఈస్ట్రర్న్ యూనివర్శిటీల నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు.
జయశ్రీ ఉల్లల, ప్రెసిడెంట్–సీఈఓ, అరిస్టా నెట్‌వర్క్…

2008 నుంచి సీఈఓగా ఉన్నారు.2014 నుంచి న్యూయర్క్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవ్వడానికి ఈమె కీలకపాత్ర పోషించారు.గతంలో సిస్కో, ఏఎండీలో కూడా పనిచేశారు.
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బీఎస్ పూర్తిచేశారు.శాంటా క్లారా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ చదివారు.
పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ సీటీఓ…

2011 నుంచి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్‌కు సీటీఓగా ఉన్నారు.గతంలో మైక్రోసాఫ్ట్, ఎట్ అండ్ టీ, యాహూలో పనిచేశారు.ఐఐటీ బాంబేలో డిగ్రీ పూర్తి చేశారు.
అంజలి సూద్, విమియో సీఈఓ…

ఓపెన్ వీడియో ప్లాట్‌ఫాం అయిన విమియోలో అంజలి 2017 నుంచి పని చేస్తున్నారు.గతంలో అమెజాన్, టైం వార్నర్‌లో పనిచేశారు.హర్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.
సంజయ్ మెహ్రోత, ప్రెసిడెంట్–సీఈఓ మైక్రాన్ టెక్నాలజీ.

సెమీ కండక్టర్ సోల్యూషన్ కంపెనీ మైక్రాన్‌కు ఈయన సీఈఓగా ఉన్నారు.సాండిస్క్‌లో బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరించారు.యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి డిగ్రీ, మాస్టర్స్ పొందారు.
జార్జ్ కురియన్, సీఈఓ– డైరెక్టర్, నెట్‌యాప్…

2015 నుంచి నెట్‌యాప్‌లో పనిచేస్తున్నారు.సిస్కో, అకామై టెక్నాలజీ, మెకెన్సీ అండ్ కంపెనీలో పని చేశారు.కేరళ కొట్టాయంకు చెందిన ఈయన ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు.స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
అనీల్ భస్రీ, కో–ఫౌండర్, చైర్మన్, వర్క్ డే.

దేవ్ డఫీల్డ్‌తో 2005 నుంచి అనిల్ భస్రీ వర్క్ డేలో పనిచేస్తున్నారు.బ్రౌన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారు.స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.
స్టీవ్ సంఘీ, ఎగ్జిగ్యూటీవ్ మైక్రోచిప్ టెక్నాలజీ.

1989, 1991 వరకు మైక్రోచిప్ సీఈఓగా పనిచేశారు.ఇంటెల్‌లో కూడా పనిచేసిన అనుభవం ఉంది.పంజాబ్ యూనివర్శిటీ నంచి డిగ్రీ పొందారు.యూనివర్శిటీ ఆఫ్
మాసచూసెట్స్‌లో మాస్టర్ ఎలక్ట్రిల్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
అమన్ భటని, గో డ్యాడీ సీఈఓ…

అమన్ గో డ్యాడీకి 2019 నుంచి సీఈఓగా పనిచేస్తున్నారు.ఎక్స్‌పిడియాలో పనిచేశారు.ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ, లాన్‌కాస్టర్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.
అనిరుద్ దెవ్గాన్, క్యాడెన్స్ డిజైన్ సీఈఓ…

ఈయన 2018 నుంచి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.మ్యాగ్మా డిజైన్ ఆటోమెషన్‌తోపాటు ఐబీఎంలో కూడా పనిచేశారు.దెవ్గాన్ ఐఐటీ డిల్లీలో డిగ్రీ పూర్తి చేశారు.కర్నెగీ మెల్లాన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్ డీ పొందారు.
శివ శివరాం, వెస్ట్రన్ డిజిటల్ ప్రెసిడెంట్.

ఈయన వెస్ట్రన్ డిజిటల్ కంటే ముందు ఇంటెల్, మ్యాట్రిక్స్ సెమీకండక్టర్, శాండిస్క్‌లో పనిచేశారు.ట్విన్ పీక్స్ టెక్నాలజీకి సీఈఓగా కూడా వ్యవహరించారు.ఎన్‌ఐటీ తిరుచ్చిలో డిగ్రీ పూర్తి చేశారు.
మాస్టర్స్, డాక్టరోటే రెన్సెలియర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివారు.