అమృత ప్రణయ్ పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో....

తెలుగులో అప్పట్లో వచ్చినటువంటి చంటిగాడు అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

అంతేగాక ఈ చిత్రంలోని పాటలలో ఒకటి అయినటువంటి "ఒక్కసారి పిలిచావంటే " అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆనందింప చేస్తుంది.

అయితే ఏమైందో ఏమో గాని ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి బాలాదిత్య ఈ మధ్యకాలంలో  సినిమాల్లో కనిపించడం మానేసాడు.దీంతో పలు పుకార్లు బాలాదిత్య గురించి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా బాలాదిత్య ఈ విషయాలపై స్పందించాడు.ఇందులో భాగంగా బాలాదిత్య తాజాగా అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నర్రా నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడని తెలిపారు.

అయితే తనపై వస్తున్నటువంటి వార్తల గురించి స్పందిస్తూ తన చదువుల నిమిత్తమై కొద్దికాలంపాటు సినిమాల నుంచి విరామం తీసుకున్నానని అంతే తప్ప వేరే ఇతర కారణాలు లేవని చెప్పు కొచ్చాడు.ఇక తన చిత్రం గురించి మాట్లాడుతూ అప్పట్లో సంచలనం రేపినటువంటి ప్రణయ్ అమృత ప్రేమ కథలను బట్టి తమ పాత్రలను దర్శకుడు నర్రా నాగేశ్వరరావు తెరకు ఎక్కించాడని తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ పాటను కూడా విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు.

Tollywood Young Hero Baladitya Is Playing Pranay Role
Advertisement
Tollywood Young Hero Baladitya Is Playing Pranay Role-అమృత ప్రణ

అయితే ఈ చిత్రంలో బాలాజీ సరసన టాలీవుడ్ హీరోయిన్ అర్చన నటించింది.అలాగే మరో కీలకపాత్రలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటించింది.అయితే ప్రస్తుతం బాలాదిత్య తన పాత్రకి తగ్గట్టు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను అని అని చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు