ఈ హీరోయిన్ అందుకే  45 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదట...

తెలుగు సినీ పరిశ్రమలో  90 సంత్సర కాలంలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించినటువంటి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

అయితే టబు ఒక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటిం కూడా తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది.

ఆ తర్వాత పూర్తిగా కొంత కాలం పాటు బాలీవుడ్ సినీ పరిశ్రమకే పరిమితం అయింది.అయితే ఈ మధ్య కాలంలో నటి టబు కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం నటి టబు కి 48 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అయితే ఇందులో ఎక్కువగా అప్పట్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో కొడుకుతో టబు ప్రేమలో పడిందని కానీ పలు కుటుంబ కారణాల వల్ల ఆ ప్రేమ పెళ్లికి దారి తీయలేదని కొందరు బలంగా చర్చించుకుంటున్నారు.

ఇప్పటివరకు మాత్రం టబు ప్రేమలో పడిన ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియడం లేదు.అంతేగాక ఒకానొక సమయంలోటబు తెలుగు సినీ పరిశ్రమకు దూరం అవడానికి ఆ హీరోనే కారణం అని కూడా పలు వార్తలు వినిపించాయి.

Advertisement

కానీ ఎప్పుడూ కూడా నటి టబు ఈ విషయం గురించి ఎక్కడ స్పందించకపోవడంతో నిజానిజాలు ఏంటనేది తెలియడం లేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురంలో అనే చిత్రంలో  ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

కాగా ప్రస్తుతం టబు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ఓ బాలీవుడ్ చిత్ర రీమేక్ లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు