ఆ సినిమాతో తెరమరుగై మళ్ళీ డర్టీ హరితో కనిపించిన హీరోయిన్.. కానీ... 

తెలుగులో 2017 సంవత్సరంలో యంగ్ దర్శకుడు రిషి దర్శకత్వం వహించిన  “ప్రేమతో మీ కార్తీక్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ గురించి సిమ్రత్ కౌర్ నిన్న మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.అయితే ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 చిత్ర ఫేమ్ శివ కార్తికేయన్ హీరోగా నటించాడు.

 Simrat Kaur, Telugu Heroine, Latest Movie News, Durty Hari, Prematho Mee Karthee-TeluguStop.com

కాగా ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి తన తదుపరి చిత్ర అవకాశాన్ని దక్కించుకోవడానికి దాదాపుగా రెండేళ్ల కాలం పట్టింది.

దాంతో ఇటీవలే ప్రముఖ దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన  “డర్టీ హరి” చిత్రంలో అందాలు ఆరబోస్తూ కొంతమేర బోల్డు తరహాలో కనిపించడంతో ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేగాక ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అందాల ఆరబోతకు కొంతమేర దూరంగా ఉన్నప్పటికీ  డర్టీ హరి కోసం కొంత గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.దీంతో కొంతమంది నెటిజన్లు అవకాశాలు లేకపోవడంతోనే సిమ్రత్ కౌర్ ఇలాంటి బోల్డ్ తరహా పాత్రలో నటించేందుకు ఒప్పుకుందని గుసగుసలాడుకుంటున్నారు.

అయితే మరోవైపు ఇదివరకు మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరించినటువంటి దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు నుంచి ఇలాంటి బోల్డ్ తరహా చిత్రం వస్తుందని ఇప్పటివరకూ అభిమానులు ఊహించలేదు.  దాంతో డర్టీ హరిని ప్రేక్షకులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో సిమ్రత్ కౌర్ తో పాటు నూతన నటుడు శ్రవణ్ రెడ్డి మరియు యంగ్ హీరోయిన్ రుహని శర్మ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube