Tollywood Sequels: టాలీవుడ్ లో నెక్స్ట్ 2 పార్టులుగా రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలు ఇవే!

నేడు తెలుగు సినిమా దశాదిశ మారిపోయిందని చెప్పుకోవాలి.

ఏ ముహూర్తన దర్శక ధీరుడు బాహుబలి( Baahubali ) తీశాడోగానీ, అప్పటినుండి ప్రపంచం మన తెలుగు సినిమాలవైపు చూడడం మొదలు పెట్టింది.

అక్కడితోనే ఇక్కడ సినిమాల్లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది.ఒకప్పుడు సినిమా కేవలం ఒక పార్టుగా మాత్రమే వచ్చేది.

కానీ ఇప్పుడు బడా సినిమాలన్నీ దాదాపుగా 2 పార్టులుగా వస్తున్నాయి.ఎందుకంటే రెండు పార్టులను కూడా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి.

ఈ క్రమంలో తెరకెక్కిన “బాహుబలి, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వమ్” సినిమాలు ఎంతటి ప్రభంజనం సృస్టించాయో ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు.మరోవైపు అల్లు అర్జున్ నటించి మెప్పించిన పుష్ప సినిమాకు( Pushpa 2 ) పార్ట్ 2 రాబోతున్న విషయం విదితమే.

Advertisement

ఇంకా మన తెలుగులో అలా రెండు పార్టులతో రాబోతున్న బడా సినిమాల కహానీ ఇక్కడ చూద్దాము.ఇక్కడ ముందుగా ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో చేస్తోన్న ‘సలార్’( Salaar ) మూవీ గురించి మాట్లాడుకోవాలి.

ఈ సినిమాని ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా రెండు భాగాలు కలిపి రూ.3000 వేల కోట్లు వసూళు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట చిత్ర మేకర్స్.ఈ మధ్య ప్రభాస్( Prabhas ) సినిమాలు ఢీలా పడడంతో అభిమానులు ఈ సినిమాపైనే ఆశాలన్నీ పెట్టుకున్నారు.

మరి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.తరువాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా గురించి మాట్లాడుకోవాలి.ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండోపార్ట్ పైన కూడా ఆదేమాదిరి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని ఆగష్టు 15న వచ్చే యేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఇదే వరుసలోకి వచ్చి చేరుతుంది ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘దేవర’ సినిమా.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

( Devara Movie ) కథా రీత్యా స్పాన్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని దర్శకుడు 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

Advertisement

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 2 భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా నిలువనుంది.ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్‌టి‌ఆర్ తాజాగా వుత్తమ నటుడి అవార్డుని కూడా పొందడం మనం చూశాం.దాంతో ఇండియా అంతటా వీరి సినిమాలకు మంచి హైప్ వుంది.

యేది ఏమైనా ఓ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించడం అనే కాన్సెప్ట్‌ కు బాహుబలి పునాది వేసింది అనడంలో అతిశయోక్తి లేదు.మరోవైపు ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువగా ఉండడంతో ఇలాంటి సినిమాలను నిర్మాతలు తెరకెక్కించడానికి ముందుకు వస్తున్నారు.

తాజా వార్తలు