టాలీవుడ్ స్టార్స్ కి తెలుగులో ధన్యవాదాలు తెలిపిన మోడీ

కరోనా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంత పోరాటం చేస్తుంది.ఇక ఈ పోరాటంలో ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి మద్దతు లభిస్తుంది.

అలాగే సెలబ్రిటీలు కూడా తమవంతుగా ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి ఆర్ధిక విరాళం అందించడంతో పాటు.

వీడియోలతో సందేశం ఇస్తున్నారు.అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించాలని పిలుపునిస్తూ ఒక సాంగ్ ద్వారా అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.

ఈ సాంగ్ ని కోటి ఆలపించగా చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్స్ అందరూ కనిపించారు.వి కిల్ కరోనా, వి ఫైట్ విత్ కరోనా అంటూ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Advertisement

ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ వరకు వెళ్లింది.దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసారు.

చిరంజీవిగారికి, నాగార్జునగారికి, వరుణ్ తేజ్ కి, సాయి ధరమ్ తేజ్ కి మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.

అందరం సామాజిక దూరం పాటిద్దాం.కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.

అని మోడీ ట్వీట్ చేసారు.ఇప్పుడు టాలీవుడ్ హీరోలని మెచ్చుకుంటూ మోడీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇదిలా ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితిలో టాలీవుడ్ అంతా ఏకతాటిపై ఉండటంతో పాటు, సినీ కార్మికులకి అండగా నిలబడటాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు