'లేడీ గెటప్'లో చిరంజీవి, బాలయ్య ఎంత బాగున్నారో.. ఇంకా చాలామంది?

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా ఉన్న మన హీరోల సినిమాలలో వారు ఎప్పుడు హీరోయిజం చూపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

అయితే ఆ హీరోలు ఒకసారిగా లేడీ గెటప్ లో కనిపించి, అచ్చం అమ్మాయిలాగే హావభావాలను వ్యక్తపరుస్తూ నటిస్తే ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.

అలా లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మన స్టార్ హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం.*బాలకృష్ణ: నట సింహం నందమూరి బాలక‌ష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించిన బాలకృష్ణ పాండురంగడు సినిమాలో లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

*చిరంజీవి: 150 పైగా చిత్రాలలో నటించిన చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్నాడు.అన్ని సినిమాలలో తన హీరోయిజం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అయితే చిరంజీవి చంటబ్బాయి సినిమాలో లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

*కమల్ హాసన్: టాలీవుడ్ ప్రఖ్యాత కళాకారులలో కమల్ హాసన్ ఒకరు.ఇటు తెలుగులోనూ,అటు తమిళంలోనూ ఎంతో క్రేజ్ ఉన్న కమల్ హాసన్ భామనే సత్య భామనే చిత్రాలలో భామ, దశావతారం పాత్రలలో లేడీ దుస్తులను ధరించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

Advertisement

*రాజేంద్ర ప్రసాద్: ఎన్నో హాస్యాస్పద చిత్రాలలో హీరోగా నటించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ తన మాట తీరు తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్ లో మేడమ్, వివాహ భోజనంబు, ఆల్ రౌండర్ చిత్రాలలో నటించి అందరినీ మెప్పించారు.

*నరేష్: టాలీవుడ్ పరిశ్రమలోనీ ఉత్తమ నటులలో నరేష్ ఒకరు.ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించిన నరేష్ చిత్రం భళారే విచిత్రం సినిమాలో లేడీ దుస్తులతో ఆయన చేసిన నటనకు ఎన్నో ప్రశంసలు కురిపించడంతో పాటు, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

*మంచు మనోజ్: మంచు మనోజ్ టాలీవుడ్ లో అసాధారణమైన నటనతో, వ్యక్తిత్వం తో కూడిన యంగ్ డైనమిక్ హీరో.కామిక్ సినిమాలలో ప్రధాన నటుడిగా నటించిన మనోజ్ పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో మోహిని అనే లేడీ గెటప్ లో నటించి అందరిని మెప్పించాడు.

*సుమంత్..

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఏఎన్ఆర్ పాత్ర పోషించిన సుమంత్ ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో చీరకట్టుతో ఎంతో అందమైన డాన్స్ చేస్తూ అమ్మాయి వేషధారణలో అదరగొట్టాడు.*అల్లు అర్జున్: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.అల్లు అర్జున్ తన మొదటి సినిమా గంగోత్రి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం నిర్వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లేడీస్ దుస్తులతో నటించారు.

Advertisement

*వెంకటేష్: హీరో వెంకటేష్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.వెంకటేష్ బాడీగార్డ్ సినిమా కోసం లేడీ దుస్తులను ధరించి నటించాడు.

*అలీ: తెలుగు సినీ పరిశ్రమలు తన కామెడీ ద్వారా ఎన్నో సినిమాలలో నటించిన ఆలీ, లేడీ గెటప్ లో టాటా బిర్లా మధ్యలో లైలా, చిరుత, ఖైదీ నెంబర్ 150 వంటి మరెన్నో చిత్రాలలో లేడీ పాత్రలో నటించారు.

తాజా వార్తలు