ఫస్ట్ సినిమానే బిగ్గెస్ట్ ఫ్లాప్.. బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ హీరోలకు ప్యాన్ ఇండియా రేంజ్

సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఆస్తి ఉన్నా సరే తమ కుమారుల సినిమాలను కచ్చితంగా హిట్ చేయగలిగే సామర్థ్యం ఎవరికీ ఉండదు.

చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ కుమారులను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు.

ఫస్ట్ సినిమానే మంచి సక్సెస్ చేస్తే తమ తనయులకు మంచి బూస్ట్ లభిస్తుందని భావిస్తారు.అయితే కొందరు టాలీవుడ్ పాన్ ఇండియా సెలబ్రిటీలు తమ కుమారులకు మంచి హిట్ అందించాలనే కోరికతో ఎంతో ప్రయత్నించాలి కానీ సక్సెస్ కాలేకపోయారు.

వారెవరో, వారి కుమారులు ఎవరో, ఫ్లాప్ అయిన ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్

తారక్( Junior NTR ) 1991లో తన తాతయ్య N.T.రామారావు దర్శకత్వంలో వచ్చిన "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రంలో బాలనటుడిగా నటించి మెప్పించాడు.పదేళ్ల తర్వాత 2001లో "నిన్ను చూడాలని" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఈ సినిమా ఫ్లాప్ లేదా బిలో యావరేజ్‌గా నిలిచింది.ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడైనా తారక్ మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు.

Advertisement

అతని ఫ్లాప్‌ను నందమూరి బ్యాక్‌గ్రౌండ్ కూడా కాపాడలేకపోయింది.తర్వాత స్టూడెంట్ నెం.1, ఆది సినిమాలతో స్టార్ హీరో అయిపోయాడు.ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు.

గోపీచంద్

గోపీచంద్(Gopichand ) ప్రముఖ డైరెక్టర్ T.కృష్ణకు చిన్న కుమారుడు అవుతాడు.కృష్ణ గోపీచంద్ కి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే చనిపోయారు.

అయినా సరే కృష్ణ కుమారుడు గోపీచంద్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసి అప్పట్లో చాలామంది ఆసక్తిని చూపారు.అతని ఫస్ట్ మూవీ తొలివలపు (2001)పై భారీ ఎత్తున అంచనాలను నెలకొన్నాయి.

దీన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశాడు.అయితే ఈ సినిమా చెత్త స్టోరీ వల్ల అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

దీని తర్వాత మళ్లీ హీరోగా ఛాన్స్ దొరకడానికి గోపీచంద్ కి చాలానే సమయం పట్టింది.•

అక్కినేని అఖిల్, నాగచైతన్య

Advertisement

అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.అయితే అక్కినేని అఖిల్, నాగచైతన్య మొదటి సినిమాలు ఫ్లాప్స్ కాకుండా నాగార్జున గానీ ఏఎన్ఆర్ గానీ ఆపలేకపోయారు.చైతు జోష్ సినిమా( Josh )తో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ మూవీలో అతని హీరోగా యాక్ట్ చేశాడు.అయితే ఇది మామూలు స్టోరీ, ఎక్కువ రన్ టైం కారణంగా ఫెయిల్ అయింది.

ఇక అఖిల్ తన ఫస్ట్ సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకున్నాడు.ఆ సినిమాకి తన పేరే పెట్టుకోవడం చాలామందికి విచిత్రంగా అనిపించింది.

తాజా వార్తలు